రైల్వే రికార్డ్‌.. రైలెక్కిన 63.81 కోట్ల మంది | Indian Railways record passengers freight growth June 2026 | Sakshi
Sakshi News home page

రైల్వే రికార్డ్‌.. రైలెక్కిన 63.81 కోట్ల మంది

Jul 3 2026 5:46 PM | Updated on Jul 3 2026 6:03 PM

Indian Railways record passengers freight growth June 2026

దేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా నిలుస్తూ భారతీయ రైల్వే జూన్‌ 2026లో సరకు రవాణా, ప్రయాణికుల సేవల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. అధిక సరకు లోడింగ్, పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఆధునిక సేవల విస్తరణతో సౌకర్యవంతమైన ప్రయాణానికి, సరకు రావాణా వృద్ధికి మొత్తంగా ఆర్థిక వృద్ధికి రైల్వే తోడ్పడుతోంది.

ప్రయాణికుల రద్దీలోనూ జోరు 
జూన్‌ 2026లో ప్రయాణికుల రద్దీ సైతం స్థిరంగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో 62.37 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి 63.81 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. స్వల్ప, దూర ప్రయాణాలకు ప్రయాణికులను చేరవేసే నాన్‌–సబర్బన్‌ విభాగంలో 3.9 శాతం వృద్ధి నమోదైంది. ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగింది. సబర్బన్‌ విభాగంలోనూ 0.9శాతం వృద్ధితో 33.46 కోట్ల నుంచి 33.77 కోట్లకు చేరినట్లు రైల్వే వివరించింది.

ప్రీమియం రైలు సేవల విస్తరణతో భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను ఆధునీకరిస్తోంది. వందేభారత్‌ సరీ్వసుల సంఖ్య 164కు చేరింది.  సామర్థ్య పెంపు, కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా సమర్థవంతమైన లాజిస్టిక్స్, నమ్మదగిన ప్రయాణికుల సేవలు, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.  

జూన్‌ 2026లో భారతీయ రైల్వే 142.21 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసింది. గతేడాది ఇదే నెలలో 136.71 మిలియన్‌ టన్నులు రవాణా కాగా, ఈసారి 4 శాతం వృద్ధి నమోదైంది. సరకు రవాణా ద్వారా జూన్‌ 2025తో పోలిస్తే సుమారు రూ.430 కోట్ల అదనపు ఆదాయం వచి్చంది, ఇది 3 శాతం ఎక్కువ అని కేంద్ర రైల్వే శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాన వస్తువుల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎరువుల లోడింగ్‌ 19.1శాతం, ఇతర వస్తువుల రవాణాలో 17.3 శాతం వృద్ధి సాధించింది. ఇనుప ఖనిజం(9.4 శాతం), దేశీయ బొగ్గు(4.9శాతం), క్లింకర్‌ (7.2 శాతం) రవణాలోనూ వృద్ధిని కనబర్చింది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాల నుంచి కొనసాగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వశాఖ తెలిపింది.  

మొదటి త్రైమాసికంలో 419.08 మిలియన్‌ టన్నుల సరకు లోడ్‌ 
2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో రైల్వే 419.08 మిలియన్‌ టన్నుల సరకును లోడ్‌ చేసింది. 2025–26 ఇదే కాలంలో 413.05 మిలియన్‌ టన్నులు కాగా, ఈసారి స్వల్ప వృద్ధి నమోదైంది. ఇనుప ఖనిజం లోడింగ్‌ 7.44 శాతం, క్లింకర్‌ 6.54 శాతం, ఇతర వస్తువుల రవాణా 12.16% పెరిగినట్లు రైల్వేశాఖ పేర్కొంది. వేసవి కాలంలో థర్మల్‌ పవర్‌ స్టేషన్ల అవసరాలను తీర్చేందుకు గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ జూన్‌లో పవర్‌ ప్లాంట్లకు 7 శాతం ఎక్కువ దేశీయ బొగ్గును రైల్వే సరఫరా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్‌ ఉత్పత్తికి సహకారం అందినట్లు హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement