వెలవెలబోతున్న పెయింట్స్‌ పరిశ్రమ | Indian paint sector faces margin squeeze amid intensifying competition | Sakshi
Sakshi News home page

వెలవెలబోతున్న పెయింట్స్‌ పరిశ్రమ

Dec 29 2024 4:28 AM | Updated on Dec 29 2024 4:28 AM

Indian paint sector faces margin squeeze amid intensifying competition

తీవ్ర పోటీ,  లాభాలపై ఒత్తిళ్లు 

కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడి 

కోల్‌కత: భారతీయ పెయింట్స్‌ పరిశ్రమ తీవ్ర పోటీ, లాభాలపై ఒత్తిళ్లతో సవాళ్లను ఎదుర్కొంటోందని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడించింది. ‘2021–22, అలాగే 2022–23లో పరిశ్రమ బలమైన వృద్ధిని సాధించింది. దీర్ఘకాలంగా స్థిరపడిన ప్రముఖ కంపెనీలైన ఏషియన్‌ పెయింట్స్, బర్జర్‌ పెయింట్స్, కాన్సాయ్‌ నెరోలాక్, అక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్‌ వంటి సంస్థల ఆదాయ వృద్ధి 2023–24లో 4 శాతానికి స్థిరపడింది. 

ఇది 2018–19 నుంచి 2022–23 మధ్య నమోదైన 14–15 శాతం వార్షిక వృద్ధి కంటే చాలా తక్కువ. ముడిసరుకు వ్యయాలు తగ్గడం, అమ్మకాల మిశ్రమంలో తక్కువ విలువ ఉత్పత్తుల వాటా పెరగడంతో ధరల తగ్గింపు కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ క్షీణత ఏర్పడింది. పరిమాణం మాత్రం 10 శాతం దూసుకెళ్లింది. సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రంగం 2025–26లో 8–10 శాతం వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉంది’ అని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రిచా బగారియా తెలిపారు. నివేదిక ప్రకారం.. 

ఆపరేటింగ్‌ మార్జిన్లను.. 
ప్రకటన, సేల్స్‌ ప్రమోషన్‌ ఖర్చులు 100–200 బేసిస్‌ పాయింట్లు అధికమై ఆపరేటింగ్‌ మార్జిన్‌లను మరింత దెబ్బతీస్తుంది. 2019–20 నుంచి 2023–24 మధ్య పెయింట్స్‌ రంగంలో నిర్వహణ మార్జిన్లు సగటున 18 శాతం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 16 శాతానికి వచ్చి చేరాయి. ధరల ఒత్తిడి, పెరుగుతున్న పోటీ కారణంగా 2025–26 నాటికి మార్జిన్స్‌ సుమారు 14 శాతానికి క్షీణిస్తాయని అంచనా. అయితే, స్థూల మార్జిన్‌ దాదాపు 40 శాతం స్థిరంగా ఉంటుందని అంచనా. ప్రధానంగా అధికం అవుతున్న ముడి చమురు ఉప ఉత్పత్తుల ఖర్చులను ఎదుర్కోవడానికి ఇటీవలి 1.5–2.5 శాతం ధరల పెంపు ఇందుకు కారణం. 

వ్యవస్థీకృత కంపెనీలు.. 
పెయింట్స్‌ రంగంలో వ్యవస్థీకృత కంపెనీల వాటా మధ్య కాలంలో 80 శాతానికి పెరగనుంది. ఇది ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న, కొత్తగా ప్రవేశించిన కంపెనీల భారీ సామర్థ్య విస్తరణ ఇందుకు కారణం అవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లీటర్లకుపైగా అదనపు సామర్థ్యం తోడుకానుంది. ఇందులో అ త్యధిక వాటా కొత్త బ్రాండ్ల నుంచే ఉండనుంది. మొత్తం డిమాండ్‌లో 70–75 శాతం వాటా కలిగిన డెకొరేటివ్‌ పె యింట్స్‌ ఈ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. రీ–పెయింట్‌ కార్యకలాపాలు, పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. మొత్తం డిమాండ్‌లో పారిశ్రామిక పెయింట్స్‌ వాటా 25–30 శాతం. ఆటోమోటివ్, చమురు, సహజ వాయువు, మౌలిక రంగాల్లో వీటిని వినియోగిస్తున్నారు.  

కొత్త బ్రాండ్ల రాకతో.. 
గట్టి పోటీ, సార్వత్రిక ఎన్నికలు, సుదీర్ఘ రుతుపవనాలు, ధరల తగ్గింపు ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆదాయం మరింతగా ప్రభావితమైంది. జేఎస్‌డబ్లు్య పెయింట్స్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, ఇతర కొత్త బ్రాండ్ల ప్రవేశంతో మార్కెట్‌కు అంతరాయం కలిగించింది. కొత్త బ్రాండ్లు దూకుడుగా విస్తరించి సామర్థ్యం, డీలర్‌ నెట్‌వర్క్, సేల్స్‌ టీమ్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా ప్రచార కార్యకలాపాలు, ప్రకటనల వ్యయం పెరిగింది. ఇందుకు అనుగుణంగా పోటీ పడేందుకు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు వాటి సొంత మూలధన వ్యయం, మార్కెటింగ్‌ పెట్టుబడులతో ప్రతిస్పందించడంతో ఒత్తిడి పెరిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement