
దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య, వాటి ద్వారా చేసే వ్యయం ఏటా పెరుగుతోంది. క్రెడిట్ కార్డుల వినియోగం గత ఏడు నెలల్లో గణనీయంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025 జనవరిలో 10.89 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా, జూలై నాటికి ఈ సంఖ్య 11.16 కోట్లకు చేరింది.
ఖర్చు కూడా పెరుగతోంది..
కార్డుల జారీతోపాటు వినియోగదారులు నెలకు చేసే సగటు ఖర్చు కూడా పెరుగుతోంది. సగటున ఒక కార్డు ద్వారా చేసిన వ్యయం ఈ ఏడాది జనవరిలో రూ.16,950 నుంచి జులై నాటికి రూ.17,399కి ఎగబాకింది. అంటే 2.65 శాతం వృద్ధి. ఇది వినియోగదారుల ఖర్చు అలవాట్లలో మార్పును సూచిస్తుంది.

వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు
ఈఎంఐ, బీఎన్‌పీఎల్ స్కీములు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డుల వల్ల వినియోగం పెరుగుతోంది.
డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో చిన్న లావాదేవీలు కూడా కార్డుల ద్వారా జరుగుతున్నాయి.
కార్డు జారీలు పెరగడం, సులభమైన అంగీకార విధానాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
ఇదీ చదవండి: జాబ్‌కు అప్లయి చేస్తున్నారా? జాగ్రత్త!