సంసిద్ధంగా ఉన్నారా! పన్ను చెల్లింపు దారులకు ముఖ్యగమనిక!

Important Updates For Taxpayers - Sakshi

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రోజు రానే వచ్చింది. వెబ్‌సైట్‌లో ఫారం 1 అలాగే 4 దాఖలు చేయటాన్ని ఎనేబుల్‌ చేశారు. సంసిద్ధం కండి. ముందుగా ముఖ్యమైన విషయాలు. 
31–03–2022 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడువు తేదీ 31–07–2022. 

ఫారాలు 1, అలాగే 4లో చిన్న మార్పులు మినహా పెద్ద మార్పులు లేవు. 

మీ దగ్గర పూర్తి సమాచారం కాగితాల రూపంలో ఉంటే మీరు ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేయవచ్చు. 

సమాచారం, కాగితాలు కావాలన్నా, రావాలన్నా కసరత్తు మొదలెట్టండి. 

ఐటీఆర్‌ 1 ఫారం గురించి.. 
దీన్నే ’సహజ్‌’ అని అంటారు. పేరుకు తగ్గట్లుగానే సరళంగానే ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో వేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ వేసుకోవాలంటే ఫారం ‘‘వినియోగ స్థితి’’ ( Utility) ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని వేసుకోవచ్చు. 

రెసిడెంట్‌ వ్యక్తి మాత్రమే వేయగలరు. 

31–03–2022 సంవత్సరానికి మొత్తం ఆదాయం అంటే ట్యాక్సబుల్‌ ఆదాయం రూ. 50,00,000 మించకూడదు. 

జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, వ్యవసాయ ఆదాయం రూ. 5,000 లోపలున్న వారు మరియు ఇతర ఆదాయం ఉన్న వారు మాత్రమే వేయగలరు. 

ఇతర ఆదాయం అంటే బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ, డిపాజిట్లు (బ్యాంకు, పోస్టాఫీసు, సహకార సంస్థలు) మీద వడ్డీ.. ఇతర వడ్డీల ఆదాయం ఉన్నవారు వేయొచ్చు. 

ఐటీఆర్‌ ఫారం 4 గురించి.. 
ఈ ఫారం వేతన జీవులకు వర్తించదు. 

వ్యాపారం, వృత్తి చేసే వారికి మాత్రమేవర్తిస్తుంది. 

రెసిడెంట్‌ వ్యక్తులు, హిందూ ఉమ్మడి 

కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు వేయవచ్చు. 

ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 50,00,000 దాటకూడదు. 

44ఏడీ, 44 ఏడీఏ, 44ఏఈల ప్రకారం వ్యాపారం,వృత్తుల మీద .. బుక్స్‌తో నిమిత్తం లేకుండా, లెక్కలతో నిమిత్తం లేకుండా ఊహాజనితంగా .. అంటే టర్నోవరుపై నిర్దేశిత శాతం లేదా ఎక్కువ శాతం లాభాన్ని లెక్కించే వేయాలి. 

మిగతా విషయాలన్నీ ఫారమ్‌ 1కి వర్తించేవే వర్తిస్తాయి. 

ఈ కింది పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి. 
అన్ని కాగితాలు, సమాచారం పెట్టుకుని ఒక స్టేట్‌మెంటు తయారు చేసుకోండి. 

ప్రీ–ఫిల్డ్‌ రిటర్న్‌ కాబట్టి సమాచారం ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. 

అలాంటి సమాచారం తప్పని తోచినా, మీది సంబంధించినది కాకపోయినా విభేదించవచ్చు. మార్పులు చేయవచ్చు. 

ఫెలింగ్‌ ప్రాసెస్‌ మొదలెట్టండి. 

ఈ–వెరిఫై చేయండి. 

ఇంతటితో ప్రక్రియ పూర్తి అయినట్లే .. ఎప్పటికప్పుడు డిపార్ట్‌మెంటు వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలు ఉంటాయి. అవసరం అయితే రిఫర్‌ చేయండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top