ఎనిమిదిలో పోటీ ఉంది చూడవయ్యా! హైదరాబాద్‌ స్టార్టప్‌ మహిమ

Hyderabad Ambulance Services Start Up StanPlus Creates New Trend - Sakshi

పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరుగులు తీయాల్సిందే. ఎంత త్వరగా సేవలు అందితే.. అంత త్వరగా ఎదగవచ్చనే అంచనాకి వచ్చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఫుడ్‌, గ్రాసరీ స్టార్టప్‌లు.. 2021లో ‘పది నిమిషాల’ మార్క్‌తో నయా ట్రెండ్‌ను ఫాలో అయ్యాయి. అయితే ఇప్పుడు హెల్త్‌ సర్వీసులు.. అది మనిషి ప్రాణం నిలబెట్టగలిగే  ఆంబులెన్స్ సర్వీసులకు పాకింది. ఈ విషయంలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది స్టాన్‌ఫ్లస్‌. పైగా ఇది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కావడం మరో విశేషం.    

స్టాన్‌ఫ్లస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎమర్జెన్సీ మెడికల్‌ రెస్సాన్స్‌ స్టార్టప్‌. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సేవల కోసం ఈ స్టార్టప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ఈ స్టార్టప్‌ 20 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.148 కోట్లపైనే) ఫండింగ్‌​ దాటేసింది. ఢిల్లీ కేంద్రంగా హెల్త్‌క్వాడ్‌, కలారీక్యాపిటల్‌(బెంగళూరు), హెల్త్‌ఎక్స్‌ సింగపూర్‌(సింగపూర్‌) వరుసగా ఫండింగ్‌కు వెళ్లడంతో ఈ ఘనత సాధించింది స్టాన్‌ఫ్లస్‌. 

ఈ హుషారులో నగరంలో 500 ఆస్పత్రులకు తమ సేవలకు విస్తరించేందుకు స్టాన్‌ఫ్లస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు తమ సేవల నిడివి సమయాన్ని 15 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్య ఫిక్స్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే కేవలం 8 నిమిషాల్లో మనిషి ప్రాణం నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేయబోతుందన్నమాట.  2016లో మొదలైన ఈ స్టార్టప్‌.. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌లో 3 వేల ఆంబులెన్స్‌లు ఉండగా.. అందులో స్టాన్‌ఫ్లస్‌కు 200 సొంత ఆంబులెన్స్‌లు ఉన్నాయి. 

ఎనిమిదే ఎందుకు?
ప్రస్తుతం గ్రాసరీ డెలివరీ కోసం 10 నిమిషాలు మార్క్‌ను ప్రకటించుకున్నాయి స్టార్టప్‌లు. అయితే ఆంబులెన్స్‌ సేవలను అందిం‍చే వియషంలో ఆ సమయం మరీ ఎక్కువగా(45 నిమిషాల దాకా) ఉంటోంది. అందుకే మనిషి ప్రాణాలు నిలబెట్టగలిగే ఈ విషయంపై ఫోకస్‌ చేసినట్లు స్టాన్‌ఫ్లస్‌ సీఈవో ప్రభ్‌దీప్‌ సింగ్‌ చెప్తున్నారు.  ‘ఫస్ట్‌ మినిట్‌.. లాస్ట్‌ మైల్‌’ హెల్త్‌కేర్‌ పేరుతో  గరిష్ఠంగా 15 నిమిషాలు.. కనిష్ఠంగా 8 నిమిషాల ఆంబులెన్స్‌ సేవల్ని అందించే ప్రయత్నం చేయబోతున్నారు. 

ఎఫెక్ట్.. 
దేశంలో ఫుడ్‌, గ్రాసరీ యాప్‌ల తరహాలో.. త్వరగతిన ఆంబులెన్స్‌ సర్వీసులను అందించేందుకు మరికొన్ని స్టార్టప్‌లు ఉన్నాయి.  ముంబైకి చెందిన డయల్‌4242, హైదరాబాద్‌కి చెందిన ఫస్ట్‌ కన్‌సల్ట్‌ టెక్నాలజీస్‌ ‘అంబీ’ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. అలాగే స్టాన్‌ఫ్లస్‌ ఎఫెక్ట్‌తో 8 నిమిషాల లిమిట్‌ను పరిగణనలోకి తీసుకుని మరికొన్ని స్టార్టప్‌లు తక్కువ కాలపరిమితి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘8 నిమిషాల’ మీదే ఇప్పుడు మిగతా స్టార్టప్‌ల దృష్టి కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

విమర్శకుల స్పందన
ఫుడ్‌ డెలివరీ యాప్‌ల విషయంలో 10 నిమిషాల గడువు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిజీ టైంలో ప్రమాదాలకు కారణమవుతుందని కొన్ని అభ్యంతరాలను సైతం లేవనెత్తారు. అయితే ప్రస్తుతం ఆంబులెన్స్‌ల విషయంలో మాత్రం విమర్శకులు.. వేరే గళం వినిపిస్తున్నారు. కరోనాలాంటి సంక్షోభాల నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి హెల్త్‌కేర్‌ సర్వీసుల అవసరం అవసరం ఉందనే చెప్తున్నారు.
 

చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ మాజీల స్టార్టప్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. రూ. 66 కోట్ల పెట్టుబడి వెనక్కి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top