హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..

Honda Two Wheeler Exports Cross 30 Lakh   - Sakshi

ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) సరికొత్త రికార్డులను నెలకొల్పింది. భారత్‌ నుంచి సుమారు 30 లక్షల యూనిట్ల టూవీలర్‌ వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. 

భారీ డిమాండ్‌..!
హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా 21 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అరుదైన ఘనతతో భారత్‌లో అగ్రశ్రేణి స్కూటర్ ఎగుమతిదారుగా హోండా స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవలి కాలంలో హోండాకు ఇతర దేశాల్లో భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2001లో హోండా ఎగుమతులను మొదలుపెట్టగా...15 లక్షల యూనిట్లను ఎగుమతి చేయడానికి సుమారు 16 సంవత్సరాల సమయం పట్టింది. కాగా మరో 15 లక్షల యూనిట్ల ఎగుమతులను కేవలం ఐదేళ్లలోనే సాధించడం గమనార్హం. ఈ అమ్మకాలు మునుపటి కంటే మూడు రెట్లు అధికం. 

18 పైగా ఎగుమతులు..!
తొలిసారి యాక్టివా టూవీలర్‌ బైక్‌ను 2001లో ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు 18పైగా టూవీలర్‌ వాహనాలను హోండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దేశీయ మార్కెట్‌లో టూవీలర్‌ అమ్మకాల జాబితాలో హోండా యాక్టివా  రెండవ స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో హోండా డియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్‌ నుంచి నవీ, డియో, ఎక్స్-బ్లేడ్, డ్రీమ్, సీబీ షైన్, హార్నెట్, యునికార్న్, యాక్టివా, సీబీ350 వంటివి భారీగా ఎగుమతి అయ్యాయి.

చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top