హోండా తొలి ఎలక్ట్రిక్ కారు: లాంచ్ ఎప్పుడంటే? | Honda Launch To First Electric Car in India Know The Details Here | Sakshi
Sakshi News home page

హోండా తొలి ఎలక్ట్రిక్ కారు: లాంచ్ ఎప్పుడంటే?

May 23 2026 5:11 PM | Updated on May 23 2026 5:22 PM

Honda Launch To First Electric Car in India Know The Details Here

జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా కార్స్‌ ఇండియా భారత మార్కెట్‌లో విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాపులర్‌ సెడాన్‌ మోడల్‌ సిటీలో ‘న్యూ సిటీ హైబ్రిడ్‌’ను విడుదల చేసింది.  దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. ఇదే సమయంలో కంపెనీ.. ప్రీమియం ఎస్‌యూవీ ‘జెడ్‌ఆర్‌–వీ’ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఈ సందర్భంగా హెచ్‌సీఐఎల్‌ ప్రెసిడెంట్, సీఈవో టకాషీ నకజిమా మాట్లాడుతూ, ఈ రెండు మోడళ్లతో కలిపి 2026–27 లో మొత్తం ఆరు వ్యూహాత్మక మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

ఈ కొత్త లాంచ్‌లు భారత మార్కెట్లో హోండా బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, కంపెనీ అమ్మకాలలో రెండంకెల వృద్ధి సాధించడంలో దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని 2026–27 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2030 నాటికి  ఈవీలు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు సహా పదికి పైగా కొత్త మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement