హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.3,001 కోట్లు

Hdfc Q1 Net Profit Dips To ₹3,001 Crore - Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఏడాది (2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 31% జంప్‌చేసి రూ. 5,311 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,059 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ1లో స్టాండెలోన్‌ నికర లాభం స్వల్పంగా తగ్గి రూ. 3,001 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 3,052 కోట్లు ఆర్జించింది. అయితే గత కాలపు నికర లాభంలో పెట్టుబడుల విక్రయం ద్వారా లభించిన రూ. 1,241 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ ప్రస్తావించింది.

తాజా సమీక్షా కాలంలో ఈ పద్దుకింద రూ. 263 కోట్లు మాత్రమే లభించినట్లు తెలియజేసింది. దీంతో ఫలితాలు పోల్చతగదని వివరించింది. క్యూ1లో హెచ్‌డీఎఫ్‌సీ నికర వడ్డీ ఆదాయం 22% పుంజుకుని రూ. 4,147 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.6% బలపడి 3.7%కి చేరాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,31,186 కోట్ల నుంచి రూ. 5,74,136 కోట్లకు ఎగశాయి. ఫలితాల విడుదల నేపథ్యంలో షేరు 1 శాతం బలపడి రూ. 2,463 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top