
స్వచ్చంద ప్రాతిపదికన అమలు
ఈ నెల 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: స్వచ్చంద ప్రాతిపదికన ప్రభుత్వం వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. సెపె్టంబర్ 1నుంచి అమల్లోకి వచ్చేటట్లు హాల్‌మార్కింగ్ నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) తాజాగా సవరించింది. వినియోగదారులకు డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ద్వారా వెండి స్వచ్చతను తెలియజేసే బాటలో ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది.
ప్రస్తుతం బంగారు ఆభరణాలకు అనుసరిస్తున్న విధానంలోనే వెండి ఆభరణాలకు సైతం హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్‌యూఐడీ)ను ప్రవేశపెట్టింది. దీంతో స్వచ్చతను సులభంగా గుర్తించేందుకు వీలు చిక్కనుంది. కొత్త విధానంలో భాగంగా కొనుగోలుదారులు ఆయా వస్తువు(ఆరి్టకల్) ఎలాంటిది, స్వచ్చత, హాల్‌మార్కింగ్ తేదీ, టెస్టింగ్ సెంటర్ తదితర వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది.
2025 సెపె్టంబర్ 1 తదుపరి హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాలను బీఐఎస్ కేర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు వివరాలను పరిశీలించుకోవచ్చని ఒక ప్రకటనలో బీఐఎస్ పేర్కొంది. తాజా సవరణల ప్రకారం వెండి 7 ప్రమాణాలు(800, 835, 925, 958, 970, 990, 999)గా స్వచ్చతను నిర్దారించనున్నారు. వీటిలో 958, 999ను కొత్తగా ప్రవేశపెట్టారు. సిల్వర్, ప్యూరిటీ గ్రేడ్, హెచ్‌యూఐడీతో బీఐఎస్ స్టాండర్ట్ మార్క్ పరిగణిస్తారు.