గూగుల్‌కు భారీషాక్‌..అమ్మ బాబోయ్‌!! ఈ స్మార్ట్‌ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్‌!!

Google Recalls Over 1 Million Fitbit Ionic Smartwatches   - Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు యూఎస్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ భారీ షాకిచ్చింది. గూగుల్‌కు చెందిన స్మార్ట్‌ వాచ్‌లను రీకాల్‌ చేయాలని సూచించింది. దీంతో గూగుల్‌ స్మార్ట్‌ వాచ్‌లను రీకాల్‌ చేసేందుకు సిద్ధమైంది. 

గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్‌ కంపెనీ రూ.22,631 ధరతో ఐకానిక్‌ స్మార్ట్‌ వాచ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌వాచ్‌ గూగుల్‌ కంపెనీది కావడంతో అమెరికాలో 1మిలియన్‌ వాచ్‌లు, మిగిలిన ప్రపంచ దేశాల్లో 693,000 వాచ్‌లను యూజర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా స్మార్ట్‌ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడ్డారు. స్మార్ట్‌ వాచ్‌లను ధరించడం, వాచ్‌లో ఉండే బ్యాటరీ వేడెక్కి పేలడం, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గూగుల్‌ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వరుసగా యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యూఎస్‌ కన్జ్యూమర్‌ సేఫ్టీ కమిషన్‌ సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు బిట్‌ఫిట్‌ కంపెనీకి 115 అమెరికన్‌ యూజర్లు, మిగిలిన దేశాల్లో 59మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అంతేకాదు యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం ఫిట్‌బిట్‌ కు చెందిన 10మిలియన్‌ల​ వాచ్‌లను వెంటనే రీకాల్‌ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్‌ సేఫ్టీ కమిషన్‌ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్‌ ఆ వాచ్‌లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

చదవండి: అదిరిపోయే స్మార్ట్‌ గ్లాస్లెస్‌.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్‌ చేయొచ్చు..ఇంకా ఎన్నో 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top