గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు! | Google Pixel 10 Drops Below Rs 55000 How Offers Make It Possible | Sakshi
Sakshi News home page

గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!

Apr 11 2026 6:16 PM | Updated on Apr 11 2026 6:25 PM

Google Pixel 10 Drops Below Rs 55000 How Offers Make It Possible

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 10
గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్‌ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement