ఆ సైట్‌లో బూతు పనులు కుదరవు.. పేమెంట్‌ కోసం ఈ కార్డులూ పని చేయవు!

Google Banning Of Obscenity Content After Pressure From Banks - Sakshi

కంటెంట్‌ క్రియేషన్‌ కోసం స్వేచ్ఛను ఇస్తే.. కొందరు దానిని మితిమీరి ఉపయోగించుకుంటున్నారు. అశ్లీల కంటెంట్‌ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రీమియం మెంబర్‌షిప్‌ వెబ్‌సైట్‌.. ‘ఓన్లీఫ్యాన్స్‌’ తమ అడల్ట్‌ క్రియేటర్లకు షాక్‌ ఇచ్చింది. ఇకపై అశ్లీల కంటెంట్‌కు తమ సైట్‌లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది.

అక్టోబరు 1 నుంచి
యూకేకు చెందిన సబ్‌స్రి‍్కప్షన్‌ సర్వీస్‌.. ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్‌ వైడ్‌గా యూజర్లు(భారత్‌లో సుమారు మూడున్నర లక్షలు) ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కంటెంట్‌ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం, సైట్‌లకు.. పేమెంట్‌ ద్వారా బ్యాకింగ్‌ పార్ట్‌నర్స్‌కు కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో డీసెంట్‌ సైట్‌గా పేరున్న ఓన్లీఫ్యాన్స్‌.. ఆ తర్వాతి కాలంలో అడల​​​‍్ట్‌ కంటెంట్‌ , ఆశ్లీలతకు మధ్య సన్నని గీతను చెరిపేసింది. పూర్తి అశ్లీల వెబ్‌సైట్‌గా మారింది. దీంతో ఓన్లీఫ్యాన్స్‌పై విమర్శలు పెరిగాయి. త్వరలో ఇలాంటి కంటెంట్‌పై నిషేధం విధించనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని, ఈ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి అప్‌డేట్లను యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఓన్లీఫ్యాన్స్‌ వెల్లడించింది.  

కారణం ఇదే..
విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్‌ సైట్‌లో కనిపిస్తుండడంపై బ్యాంకింగ్‌ పార్ట్‌నర్స్‌, పేఅవుట్‌ ప్రొవైడర్స్‌ ఓన్లీసైట్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఓన్లీఫ్యాన్స్‌ వెల్లడించింది. అశ్లీల కంటెంట్‌తో పాటు యాక్టివిటీస్‌ కూడా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అయితే గత నెలలో ఈ చర్యల్లో భాగంగా మొదటి అడుగు వేసింది ఓన్లీఫ్యాన్స్‌. చైల్డ్‌ పోర్నోగ్రఫీ కంటెంట్‌ ఆరోపణలపై 15 అకౌంట్లను డీయాక్టివ్‌ చేసింది. ఇకపై మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని యూజర్లను హెచ్చరించింది కూడా. ఇక NCOSE నైతిక విలువల పేరిట.. మాస్టర్‌కార్డ్‌(పేమెంట్‌ జరగకుండా) ఇలాంటి కంటెంట్‌ను చూడకుండా బ్యాన్‌ విధించింది. ‘సురకక్షితమైన పేమెంట్‌ కాద’ని పేర్కొంటూ.. ఓన్లీఫ్యాన్స్‌తో పాటు మైఫ్రీకామ్స్‌ ఇతరత్ర సైట్లకు వీలు లేకుండా చేసింది.

నో పేమెంట్స్‌
మాస్టర్‌కార్డ్‌, వీసా ఇదివరకే పోర్న్‌హబ్‌తో డీల్‌ రద్దు చేసుసుకున్నాయి. కారణం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీని ప్రొత్సహించడం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పోర్న్‌ హబ్‌.. వెరిఫై లేని యూజర్ల కంటెంట్‌ను అప్‌లోడ్‌ కానివ్వకుండా చూసుకుంటోంది. తాజాగా మాస్టర్‌కార్డ్‌.. ఓన్లీఫ్యాన్స్‌పైనా నిషేధం విధించింది. 

2016 నుంచి
లండన్‌ బేస్డ్‌గా పని చేస్తున్న ఓన్లీఫ్యాన్స్‌ వెబ్‌సైట్‌ను టిమ్‌ స్టోక్లే 2016లో స్థాపించాడు. మొదలట్లో కుకింగ్‌, ఫిట్‌ ద్వారా పేరు సంపాదించుకుంది. ఆపై పోర్నోగ్రఫీ ద్వారా పేరు మోసింది. సెక్స్‌ వర్కర్స్‌ వీటి ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్‌ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్‌‌ ఉందని యాక్సియోస్‌ సర్వే వెల్లడించింది. 

లియోనిడ్‌పై ఎఫెక్ట్‌
ఓన్టీఫ్యాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా సాలీనా 300 క్రియేటర్లు మిలియన్‌ డాలర్ల దాకా సంపాదిస్తుంటే.. 16 వేలమంది సంవత్సరానికి కనీసం యాభై వేలు సంపాదిస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్‌లో ఎక్కువ వాటా ఉక్రెయిన్‌-అమెరికాకు చెందిన పోర్న్‌ ఎంట్రప్రెన్యూర్‌ లియోనిడ్‌ రాడ్‌వింస్కీ పేరిట ఉంది. ఇందులో ఆయన వాటా వన్‌ బిలియన్‌గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్లీ కంటెంట్‌ బ్యాన్‌.. ఈ షేర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

చదవండి : Facebook Horizon Workroom: ఈ టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top