రూపే క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లకు శుభవార్త, ఆ ఛార్జీలు లేవండోయ్‌!

Good News: No Charge For Rupay Credit Card Upto Rs 2000 Upi Transaction - Sakshi

రూపే క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. ఇకపై రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నిబంధన రూ.2000 వరకు జరిపే లావాదేవీలకు వర్తిస్తుందని తెలిపింది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకులు ఈ కార్డు సేవలను అందిస్తున్నాయి.

వీటితో పాటు వాణిజ్య, రిటైల్ విభాగాల కోసం ప్రత్యేకంగా ఇంక్రిమెంటల్ కార్డ్‌లు కూడా జారీ చేస్తున్నాయి. ప్రజల ఆర్థిక వ్యవహారాలలో రూపే కార్డ్‌ విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది.

ఆర్బీఐ కొత్త నిబంధన.. ఎలంటి చార్జీలు లేవు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐకి లావాదేవీలకు రూపే క్రెడిట్ కార్డులను లింక్ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లింకింగ్‌ ప్రక్రియ ద్వారా క్రెడిట్ కార్డ్ వినియోగం పెంచాలని భావిస్తోంది ఆర్బీఐ. ఈ నిబంధన వల్ల క్రెడిట్ కార్డులను కస్టమర్లు వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్‌కు లింక్ చేస్తారు. దీని ద్వారా.. ఏటీఎం కార్డ్ వినియోగదారలు యూపీఐ లావాదేవీలు ఎలా చేస్తున్నారో, క్రెడిట్ కార్డ్ ఉన్నవారు కూడా తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. 

ఈ నిబంధన ద్వారా రూ.2,000 లేదా అంతకన్నా తక్కువ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించదు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. దీని వల్ల తక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే కస్టమర్లకు, చిరు వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది.

చదవండి: Airtel 5g: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top