Gold Price: బంగారం మరింత ప్రియం

Gold Rate in Hyderabad Today, 7th October 2021 - Sakshi

పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. అందుకే గత వారం రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తుంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు భారీగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.46,604 నుంచి రూ.46,885కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ.250 పైగా పెరిగి రూ.42,947 చేరుకుంది.

ఇక హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో రూ.220 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరగడంతో రూ.43,800కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.500కి పైగా పెరిగి రూ.61,078కు చేరింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: పేటీఎం నుంచి నవరాత్రి గోల్డ్ ఆఫర్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top