భారీగా పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజే (అక్టోబర్ 27) గోల్డ్ రేటు రెండోసారి తగ్గింది. ఉదయం గరిష్టంగా రూ. 1050 తగ్గిన రేటు.. సాయంత్రానికి మరో రూ. 1290 తగ్గింది (మొత్తం రూ. 2340 తగ్గింది). దీంతో మరోమారు పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రస్తుత ధరలకు సంబంధించిన వివరాల విషయానికి వస్తే..
హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2340 తగ్గి.. రూ. 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2340 తగ్గి రూ. 1,23,430 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2150 తగ్గి రూ. 1,13,150 వద్దకు చేరింది.
చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి కూడా అలాగే ఉంది. (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 540 తగ్గి.. రూ. 1,24,910 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు 500 తగ్గి.. రూ. 1,14,500 వద్ద నిలిచింది).
గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు
➤అమెరికా డాలర్ బలపడం: డాలర్ విలువ పెరిగితే.. బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్‌లోనే ట్రేడ్ అవుతుంది.
➤వడ్డీ రేట్లు పెరగడం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే, ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు.
➤ద్రవ్యోల్బణం తగ్గడం: ద్రవ్యోల్బణం తగ్గితే, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించేవారు సంఖ్య తగ్గుతుంది.
➤రాజకీయ పరిస్థితులు: ప్రపంచ రాజకీయ పరిస్థితులు కొంత స్థిరంగా ఉండడం వల్ల, బంగారం ధరలపై ఒత్తిడి తగ్గుతుంది.
➤చైనాలో డిమాండ్ తగ్గడం: బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉంటాయి. అయితే చైనాలో ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ కొంత తగ్గింది.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి


