రూ.50 వేలు దాటేసిన బంగారం ధర

Gold Price Today: Yellow Metal Trading At 50,070 - Sakshi

ప్రపంచంలో బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందు ఉంటుంది. భారత్‌లో బంగారానికి ఉన్నంత డిమాండ్‌ దేనికి ఉండదు. మహిళలు అలంకరణ కోసం తీసుకుంటే, మగవారు పెట్టుబడుల కోసం కొనుగులు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగారం ధర భారీగా పెరగింది. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,587 నుంచి రూ.48,975కు పెరగింది. ఇక, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,506 నుంచి రూ.44,861కు చేరుకుంది. 

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,810 నుంచి రూ.45,900కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ ఏర్పడింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.782 పెరగడం ద్వారా రూ.71,370కు చేరింది.

చదవండి: ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top