
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.
రూ.లక్షా 50వేలు దాటుతుంది..
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.
– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి