 
													బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం గరిష్టంగా రూ. 1200 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1800లకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి 600 రూపాయలు పెరిగిందన్న మాట. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎలా ఉంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1800 పెరిగి రూ. 1,23,280 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగి రూ. 123430 వద్ద ఉంది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ల రేటు రూ. 1600 పెరిగి రూ. 1,13,150 వద్ద ఉంది.
చెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం స్థిరంగా ఉన్న రేటు సాయంత్రానికి కూడా స్థిరంగానే ఉంది. ఇక్కడ 10 గ్రామ్స్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,280 వద్ద ఉండగా.. 10 గ్రామ్స్ 24 క్యారెట్ల రేటు రూ. 1,13,000 వద్దనే ఉంది.
వెండి ధరలు
వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 1,65,000 వద్ద ఉంది. అంటే ఒక గ్రామ్ సిల్వర్ ధర 165 రూపాయలన్నమాట. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 151000 వద్ద నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర కొంత తక్కువే అని తెలుస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
