
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వచ్చే చిన్న చిన్న టెన్షన్‌లను కట్ చేసి, మీ ఫోకస్, కంఫర్ట్, పీస్ ఆఫ్ మైండ్‌ను కాపాడే గాడ్జెట్లే ఇవీ!
జీరో డిస్ట్రాక్షన్!
పక్కింటి వర్కర్ బోర్‌వెల్ డ్రిల్ చేస్తున్నా, ఇంట్లో పిల్లలు కార్టూన్ సాంగ్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నా మీ పనిమీద ఫోకస్ తగ్గాల్సిన అవసరం లేదు. ఈ ‘నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్’ మీ చుట్టూ ఉన్న మొత్తం హంగామాను మ్యూట్ చేసి, మీకు సైలెన్స్ అనే లగ్జరీని అందిస్తాయి. కంఫర్ట్ ఫిట్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉండటంతో గంటల తరబడి వేసుకున్నా ఇబ్బంది లేదు. వైర్‌డ్ – వైర్‌లెస్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ల్యాప్‌టాప్, ఫోన్, ట్యాబ్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ అయినా, డీప్ వర్క్ సెషన్స్ అయినా లేదా మ్యూజిక్‌లో మునిగిపోవడానికైనా ఇది బెస్ట్ సౌండ్ షీల్డ్. ధర రూ.3,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.

వైర్లు క్రమంగా, మనసు ప్రశాంతంగా!
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామందికి ఆనందమే కాని, టేబుల్ కింద గజిబిజిగా ఉన్న కేబుల్స్ మాత్రం టెన్షన్ పెంచుతాయి. పొరపాటున ఒక్కటి లాగితే, మిగతావన్నీ కట్టుకట్టుకుని ‘మమ్మల్ని విడదీయొద్దు’అన్నట్టే దాడి చేస్తాయి. ఈ గందరగోళానికి సింపుల్ పరిష్కారమే ‘కేబుల్ మేనేజ్‌మెంట్ కిట్’. బలమైన పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఈ కిట్‌లో పెద్దవి, చిన్నవి అన్న తేడా లేకుండా ఒకేసారి ఎనిమిది కేబుల్స్ వరకు సర్దుకోవచ్చు. కిట్‌లోనే చుట్టే టైలు, వైర్ హోల్డర్లు ఉన్నందున అదనంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. గోడకు స్క్రూ పెట్టి లేదా అతికించుకుని, కొన్ని నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్, ఫైర్‌ప్రూఫ్ కావడంతో దీర్ఘకాలం టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. మార్కెట్లో ఇది సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య లభిస్తుంది.

క్లీనింగ్ క్రష్!
కాఫీ సిప్, హాట్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ టైప్ చేయడం సంతోషమే! కాని ఒక్కసారి అవి కీబోర్డ్ లోపలికి జారిపడితే, వర్క్ మూడ్ మొత్తం ఆఫ్ అవుతుంది. అప్పుడు గుడ్డతో తుడుస్తూ టైమ్ వేస్ట్ చేయకుండా, వెంటనే ఈ ‘మినీ వ్యాక్యూమ్ క్లీనర్’ను రంగంలోకి దింపండి. ఇది మీ డెస్క్‌టాప్‌ను క్షణాల్లో తళతళలాడే స్పాట్‌లైట్ లుక్‌తో మెరిసేలా చేస్తుంది. క్యూట్‌గా ఉండే ఈ పరికరం అరచేతిలో పట్టేంత చిన్న సైజులోనే ఉంటుంది. వైర్‌లెస్ కాబట్టి ఎక్కడైనా సులభంగా క్లీనింగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్, టేబుల్, చిన్న మూలలు ఎక్కడ దుమ్ము, ధూళి ఉన్నా ఒక్క బటన్ నొక్కితే చాలు, చిటికెలో మాయం! లోపల ఉన్న కలెక్షన్ కంపార్ట్‌మెంట్ తీయడం, ఖాళీ చేయడం కూడా ఈజీ. ఒకసారి చార్జ్ చేస్తే గంటపాటు పనిచేస్తుంది. ధర రూ.800 నుంచి రూ.1,200 మధ్య ఉంటుంది.
