ఫ్లిప్‌కార్ట్‌కు 600 మిలియన్‌ డాలర్లు

Flipkart to get 600 mln dollers from Walmart under new fundraise - Sakshi

10 శాతం అధిక వేల్యుయేషన్‌తో సమకూరుస్తున్న వాల్‌మార్ట్‌

న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం 600 మిలియన్‌ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుత వేల్యుయేషన్‌కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్‌మార్ట్‌ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్‌ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్‌ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌ చివరిసారి 37.6 బిలియన్‌ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్‌ డాలర్లను  సమీకరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top