ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..! | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!

Published Wed, Sep 20 2023 4:34 PM

Fitness influencer Adriana passed away followers mourns - Sakshi

బ్రెజిలియన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్రియానా థైసెన్ (49) అకస్మాత్తుగా కన్నుమూయడం విషాదాన్ని రేపింది.  కేవలం ఒక్క ఏడాదిలోనే 100 పౌండ్లు (45 కిలోలు)  తగ్గి పాపులర్‌ అయిన థైసెన్  అనూహ్యంగా కన్నుమూసింది. ఆమె అకాల మరణ వార్తను ఆమె బంధువు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్‌ చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోయర్లు  తీవ్ర సంతాపాన్ని  ప్రకటించారు.

థైసెన్ సెప్టెంబరు 17న బ్రెసిలియాకు దక్షిణంగా ఉన్న ఉబెర్‌లాండియాలోని తన నివాసంలో అంతుచిక్కని వ్యాధితో మరణించినట్టు తెలుస్తోంది.  అయితే ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబ సభ్యులు  వెల్లడించ లేదు. ఆమె మృతిపై సంతాపాన్నిప్రకటించి, ఆత్మశాంతికి ప్రార్దనలు చేయాలని మాత్రమే అభ్యర్థించారు.

థైసెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య  6 లక్షలకు పై మాటే. ముఖ్యంగా తన వెయిట్‌ లాస్‌ జర్నీతో  కేవలం 100 మందితో మొదలు పెట్టి క్రమంగా బాగా పాపులర్‌ అయింది. అదే ఆమెకు ఇంటర్నెట్ స్టార్‌డమ్‌ తెచ్చి పెట్టింది. చిన్ననాటి నుండి అధికత బరుతో బాధపడేది. చివరికి మాదకద్రవ్యాల బానిసై, డిప్రెషన్‌లోకి వెళ్లి పోయింది. కానీ  దీన్నుంచి బయటపడటానికి భయంకరమైన పోరాటమే చేసింది.

39 ఏళ్ల నాటికి  220 పౌండ్ల (సుమారు 100 కిలోలు) బరువుతో ఆమె తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది. తన కష్టాలను వివిధ టాక్ షోలలో మాట్లాడుతూ థైసెన్ సోషల్ మీడియాలో దారుణంగా విలపించేది. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని  ప్రోత్సహించేది. ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామంతో కమిటెడ్‌గా పనిచేసి బరువు తగ్గానంటూ చాలామందికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచింది. 

ఫిట్‌నెస్  ప్రయాణాన్ని కొనసాగిస్తూనే 'ద్రికాస్ స్టోర్' అనే ప్లస్-సైజ్ యాక్టివ్‌వేర్ , దుస్తుల బ్రాండ్‌ను కూడా నడిపింది. పోషకాహార నిపుణుడి వద్దకు వెళ్లే స్థోమత లేక ఆన్‌లైన్‌లో లభించిన చిట్కాలను ఉపయోగించి పండ్లు సలాడ్స్‌,  జ్యూస్‌లతో తనదైన ఆహార  నియమాలు,కఠిన వ్యాయాయంతో తనను తాను తీర్చిదిద్దు కుంది.  అలా ఫిబ్రవరి 2013లో 107 కిలోల బరువునుంచి  62.7 కేజీలకు చేరుకోవడం అంటే మాటలు  కాదు. కానీ చివరికి  అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని  నింపింది.

థైసెన్ ఇక లేదన్న వార్తను ఆమె లక్షలాది ఫాలోయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారిక దృవీకరణేదీలేనప్పటికీఘామె ఆత్మహత్య చేసుకుందని కమెంట్‌ చేస్తున్నారు. అద్భుతమైన, అందమైన మహిళ, ఆత్మహత్య చేసుకోవడంబాధాకరం, సోషల్‌మీడియా కామెంట్లే ఆమెను చంపేశాయని కొందరంటే, అర్ధంలేని కామెంట్లు మానేసి డిప్రెషన్‌తో  బాధపడుతున్న వారిని మాటల్ని విందాం అంటూ మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆత్మహత్య అవగాహన నెల, యెల్లో రిబ్బన్‌తో ప్రాతినిధ్యం వహించే 'ఎల్లో సెప్టెంబర్'  థైసెన్  మృతిపై  పలువురు వినియోగదారులు విచారం వ్యక్తం చేశారు.

ఎవరితోనూ పోల్చుకోకండి, ఏదైనా మన చేతిలో
మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి, ప్రతి ఒక్కరికి భిన్నమైన శారీరక స్వభావం, చర్మం, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులు ఉంటాయి. దాని ప్లాన్‌ చేసుకోండి.మనం కోరుకున్నది పొందడం మనపై తప్ప మరెవరిపైనా ఆధారపడదు దీనికి నేనే రుజువు. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఇదీ తరచుగా ఆమె ఫ్యాన్స్‌కు చెప్పేమాట.

Advertisement
 
Advertisement
 
Advertisement