
నగరంలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకుకోవడం చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే కొందరు మాత్రం సొంత ఇల్లు ఉండాలా?, అద్దె ఇంట్లోనే ఉండాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంలోనే మునిగిపోతారు. ఈ ప్రశ్నకు చాన్నాళ్ల నుంచే వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా ఫిన్‌ఫ్లూయెన్సర్ 'అక్షత్ శ్రీవత్సవ' స్పందించారు.
''భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్లు కొనడం అంటేనే.. మీరు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం బిల్డర్ల నియంత్రణలోనే ఉంటుంది.. కాబట్టి ఇల్లు కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు ఆ ఇల్లును అమ్మడం కూడా ఒక పెద్ద సవాలు. కాబట్టి అద్దెకు తీసుకోండి, ప్రశాంతంగా జీవించండి'' అని అక్షత్ శ్రీవత్సవ అన్నారు. ఒకవేళా ఇల్లు కొనాలంటే.. తప్పకుండా 30 ఏళ్లు నివసించడానికి ఉండే దాన్ని కొనండి అని సూచించారు.
ప్రస్తుతం శ్రీవత్సవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల గణనీయమైన రాబడి వస్తుందని చెబుతున్నారు. సొంత ఇల్లు ఉంటె అద్దె వంటివి తగ్గుతాయని ఇంకొందరు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇల్లు కొనడం దీర్ఘకాలిక సంపదను పెంచుతుందని.. స్థిరత్వాన్ని అందిస్తుందని వాదించారు.
Buying a property in an Indian Metro is going to be one of your worst mistakes: ---
1) Entire market is builder controlled (so you buy very expensive)
2) Overdevelopment is causing infrastructure issues (so the cities are becoming unlivable)
3) With constant new developments,…— Akshat Shrivastava (@Akshat_World) September 2, 2025