ఇక మేడిన్‌ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం! | The Era of Made in India CCTV Cameras Begins | Sakshi
Sakshi News home page

ఇక మేడిన్‌ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం!

Apr 3 2026 7:46 PM | Updated on Apr 4 2026 8:50 AM

The Era of Made in India CCTV Cameras Begins

న్యూఢిల్లీ: దిగుమతి చేసుకున్న, సర్టిఫై చేయని యూనిట్లపై నిషేధంతో సీసీటీవీ కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాయి. హిక్‌విజన్, టీపీ–లింక్‌లాంటి చైనీస్‌ సీసీటీవీ కంపెనీలపై దీనితో ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

స్టాండర్డైజేషన్‌ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్‌ (ఎస్‌టీక్యూసీ) నిబంధనల అమలుతో సర్వైలెన్స్‌ పరిశ్రమ స్వరూపం మారినట్లు సీపీ ప్లస్‌ బ్రాండ్‌ సీసీటీవీలను తయారు చేసే ఆదిత్య ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. ఎస్‌టీక్యూసీ లేని సీసీటీవీ యూనిట్ల విక్రయాన్ని 2025 ఏప్రిల్‌ 9 నుంచి కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. అయితే అప్పటికే దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు వీలు కల్పించింది. దీనితో పలు సంస్థలు దేశీయంగా ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాయి.

Advertisement
 
Advertisement
Advertisement