
ఉద్యోగం చేస్తున్నవారిలో చాలామంది కోరుకునేది.. వాళ్ళను కంపెనీ నుంచి తొలగించకూడదనే. అయితే అనుకోకుండా జాబ్ నుంచి తీసేస్తున్నట్లు మెయిల్ వస్తే?, గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?..
టెర్మినేషన్ అనే సబ్జెక్ట్ లైన్‌తో.. హెచ్ఆర్ నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ మెయిల్ అందింది. ఈ మెయిల్ చూడగానే దాదాపు ఉద్యోగులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉద్యోగం నుంచి తొలగించేసారమో భయపడ్డారు. అయితే ''భద్రతా ఉల్లంఘనల కారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్లు'' ఆ మెయిల్ సారాంశం. చదివిన తరువాత ఊపిరి పీల్చుకున్నారు.

మెయిల్ చూడగానే.. గుండెపోటు వచ్చినంత పనైందని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. వారికి వచ్చిన మెయిల్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఇలాంటి మెయిల్స్.. కోవిడ్ సమయంలో చాలామంది అందుకున్నారు. అప్పటి నుంచి ఇలాంటి మెసేజస్ వస్తే.. ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఉద్యోగులు మెయిల్ చూడగానే భయపడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?