డెస్టినేషన్‌ దుబాయ్‌..! 2021లో యూఏఈ తీసుకున్న సంచలన నిర్ణయాలు..!

Dubai Bids Adieu To 2021 In Style Digging Deep Into World Talent Pool - Sakshi

కోవిడ్‌ 19 దెబ్బతో ప్రపంచ దేశాలు కుదేలైన క్రమంలో దుబాయ్‌ మాత్రం.. ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడింది. పటిష్ట కోవిడ్‌ నియంత్రణ చర్యలతో అటు ప్రజారోగ్యాన్ని కాపాడుతూనే ఇతర దేశాలకు డెస్టినేషన్‌ సిటీగా నిలుస్తోంది..!

అగ్రదేశాలకు అతిథ్యం ఇవ్వడంలో, టూరిస్టులను ఆకర్షించడంలో...ధనిక వర్గాల నుంచి వలస కార్మికుల వరకు అక్కున చేర్చుకోవడంలో ఈ గల్ఫ్‌ నగరం విజయం సాధించింది. ఈ నగరం యునైటేడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఒక బంగారు బాతులాగా నిలుస్తోంది. ప్రపంచదేశాలను మరింత ఆకర్షించేందుకు 2021లో తెచ్చిన అనేక సంస్కరణలు దుబాయ్‌ మరో అడుగు ముందుండేలా చేసింది. వరల్డ్‌ టాలెంట్‌ను ఒడిసిపట్టుకోవడంలో ఇతరదేశాల కోసం స్నేహాపూర్వక నిర్ణయాలను దుబాయ్‌ తీసుకుంది. 

వ్యూహత్మకమైన నిర్ణయాలతో...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఆర్థిక కేంద్రమైన దుబాయ్ చరిత్రలో 2021 ఒక కీలక మలుపుగా నిలుస్తోంది. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో, కోవిడ్‌-19పై యుద్ధంలో భాగంగా రికార్డు సమయంలో 100 శాతం అత్యంత వేగవంతమైన వ్యాక్సినేషన్‌తో పలు కీలక సమావేశాలను చేపట్టేందుకు ప్రపంచదేశాలకు దుబాయ్‌ తొలి స్థానంగా నిలిచింది. 

అతిథ్య, పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఎక్స్‌పో 2020కు దుబాయ్ కేంద్రంగా మారింది. కోవిడ్-ప్రేరిత మందగమనాన్ని అధిగమించడానికి 2021 సంవత్సరం ఎంతగానో కలిసివచ్చింది. కోవిడ్‌-19తో  2020లో యూఎఈ ఆర్థిక వ్యవస్థ 10.9 శాతానికి తగ్గిపోయింది. 2021 ఆర్థిక సంవత్సరానికిగాను యూఎఈ సుమారు 3.1 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2022లో సుమారు 3.4 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో దుబాయ్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే  దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనంగా నిలిచాయి.

100 శాతం విదేశీ యాజమాన్యం
పోటీతత్వాన్ని పెంపొందించడానికి,  పెట్టుబడిని, విదేశీయులను తన గడ్డపైకి ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా.. 2021 జూన్ 1న వాణిజ్య కంపెనీల చట్టానికి కీలక సవరణను యూఎఈ చేసింది. ఈ సవరణతో యూఎఈలో విదేశీయులు తమ కంపెనీలను  ఎమిరాటీ (ఆ దేశ) వాటాదారు లేదా ఏజెంట్ అవసరం లేకుండానే స్థాపించేందుకు  అనుమతించింది. ఈ సవరణపై ప్రపంచ దిగ్గజ ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. 

గోల్డెన్ వీసా
యూఎఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నవంబర్ 15న గోల్డెన్ వీసాను మంజూరు చేయడానికి ఆమోదించారు. 'గోల్డెన్ రెసిడెన్సీ'గా పిలువబడే ఈ వీసాను చాలా మంది వ్యక్తులకు మంజూరు చేశారు. అందులో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , బిగ్ డేటా, ఎపిడెమియాలజీ డిగ్రీ పట్టాలను కల్గిన వారికి కూడా గోల్డెన్‌ వీసాను అందించనుంది. ఈ సందర్భంగా గోల్డెన్‌ వీసాపై...కొత్త మైలురాళ్లను సాధించడంలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు వారు మాతో ఉండాలని కోరుకుంటున్నామని అల్ మక్తూమ్ అభిప్రాయపడ్డారు. 

గ్రీన్ వీసా 
2021లో యూఎఈ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం గ్రీన్‌ వీసా. అక్కడి  ప్రభుత్వం సెప్టెంబరు 6న గ్రీన్ వీసాను విడుదల చేసింది. దీంతో యూఏఈలో పనిచేయాలనుకున్న  విదేశీయులు  వారి యజమాని ద్వారా స్పాన్సర్ చేయకుండానే పనిచేసే వెసులుబాటును కల్పించింది. 

ఎకానమీ అండ్‌ టూరిజం సంస్థల వీలినం
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , ఎగుమతులను పెంచడానికి మరో వ్యూహాత్మక చర్యలో భాగంగా యూఎఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ అల్ రషీద్ మక్తూమ్ నవంబర్ 6న దుబాయ్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటక సంస్థల విలీనాన్ని ప్రకటించారు. ఈ విలీనంతో  ప్రధాన ఆర్థిక సూచికలలో టాప్‌ ఐదు  ప్రపంచ నగరాల్లో దుబాయ్‌ని ఉంచడం, రాబోయే మూడేళ్లలో 100,000 కంపెనీలనుపైగా ఆకర్షించడం దీని ముఖ్య ఉద్ధేశ్యం.

ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా పనిదినాలు..!
ప్రపంచ మార్కెట్లతో తన ఆర్థిక వ్యవస్థను సమం చేయడానికి, పోటీతత్వాన్ని, ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, ఆ దేశ ఉద్యోగుల పనిలో జీవిత సమతుల్యతను, సామాజిక శ్రేయస్సును పెంచేందుకు గాను యూఎఈ  2021 డిసెంబర్ 7న తీసుకున్న నిర్ణయంతో 2022 జనవరి 1 నుంచి నాలుగున్నర రోజుల పని దినాలకు మారుతున్నట్లు  ప్రకటించింది. ప్రపంచంలో వారానికి ఐదు రోజుల కంటే తక్కువ పని దినాలు ఉన్న మొదటి దేశంగా యూఎఈ అవతరించింది. 

పేపర్‌లెస్‌ గవర్నమెంట్‌
ప్రపంచంలోనే 100 శాతం పేపర్ రహితంగా మారిన మొట్టమొదటి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. దీంతో  దుబాయ్‌లోని ప్రభుత్వ బాహ్య, అంతర్గత లావాదేవీలు చాలావరకు డిజిటల్ విధానంలోనే కొనసాగుతున్నాయి. 100 శాతం డిజిటలైజేషన్ దిశగా దుబాయ్‌ అడుగులేస్తోంది.

చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్‌’గా ఫోన్ల అమ్మకాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top