మరోసారి ‘డిస్నీ’ తొలగింపులు.. ఆందోళనలో ఉద్యోగులు

Disney Likely To Layoff 4,000 Employees In April - Sakshi

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించునుంది. ఇందులో భాగంగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్ల బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రిపోర్ట్‌ తెలిపింది. 

ఉద్యోగులకు తొలగింపుపై డిస్నీ స్పందించింది. ఏప్రిల్‌ నెలలో 4 వేల మందిని ఫైర్‌ చేస్తున్నట్లు తెలిపినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తన కథనంలో పేర్కొంది. సంస్థ పునర్నిర్మాణం, కంటెంట్‌ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. 

‘ఇది కఠినమైన నిర్ణయమే. ఉద్యోగుల తొలగింపులతో 5.5 బిలియన్ల డాలర్లను ఆదా చేసుకోవడం ద్వారా స్ట్రీమింగ్‌ బిజినెస్‌ను మరింత లాభదాయకంగా మర్చుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ మరింత ఖర్చుతో కూడుకుంది. మా వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా, ఆర్ధిక సవాళ్లతో కూడిన వాతావరణంలో కార్యకాలాపాలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాము. కాబట్టే 5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో బాబ్ ఇగర్ చెప్పారు.

ఇక లేఆఫ్స్‌పై డిస్నీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ రంగాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తొలగింపులు తమని ఏ విధంగా ఇబ్బంది పెడతాయోనని  క్షణమొక యుగంలా గడుపుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top