మళ్లీ షాక్‌.. పెరిగిన కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు | Commercial LPG cylinder prices hiked by Rs 195.5 in Delhi | Sakshi
Sakshi News home page

మళ్లీ షాక్‌.. పెరిగిన కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు

Apr 1 2026 7:39 AM | Updated on Apr 1 2026 9:19 AM

Commercial LPG cylinder prices hiked by Rs 195.5 in Delhi

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్‌లోని ప్రధాన నగరాల్లో కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.195.5, కోల్‌కతాలో రూ.218 పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు ఈ మేరకు ప్రకటన చేశాయి.

ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరగడంతో కొత్త రిటైల్ ధర రూ.2,078.50కు చేరింది. ఇప్పటికే మార్చి 1న ప్రతి సిలిండర్‌పై రూ.114.5 పెంచిన విషయం తెలిసిందే.

సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర మార్చి 7న రూ.60 పెరిగి, రూ.913కు చేరింది.  ఆ తర్వాతి నుంచి ఈ ధరల్లో ఎలాంటి మార్పులేదు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రధాన చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, కరెన్సీ మార్పిడి రేట్ల ఆధారంగా ఈ ధరలను సవరిస్తాయి.

ఎల్పీజీ మార్కెట్‌లో మార్పులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72గా ఉండగా, డీజిల్ రూ.87.62గా ఉంది. గత సంవత్సరం మార్చిలో లీటరుకు రూ.2 తగ్గింది. ఆ తర్వాత ఈ ధరల్లో మార్పు లేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement