ఏ క్షణాన ఏం జరుగుతుందో.. వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మరో ప్రముఖ కంపెనీ!

China Smartphone Maker Xiaomi Layoffs 15pc Jobs In Company Staff - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక మాంద్యం భాయాలతో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ సిబ్బందని తగ్గించే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా చైనా కంపెనీ షావోమి అదే జాబితాలోకి చేరింది. తన స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన అనేక యూనిట్లలోని ఉద్యోగుల తీసివేతకు పూనుకుంది. ఈ ప్రక్రియలో దాదాపు సంస్థలోని 15 శాతం శ్రామిక శక్తిని తగ్గించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

కొందరు బాధిత ఉద్యోగులు తమ అవేదనను సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా షేర్‌ చేయడంతో స్థానికంగా ఈ పోస్ట్‌లు వైరల్‌గా మారింది. చైనాలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వీబో, జియాహోంగ్షు, మైమైలు ఈ ఉద్యోగాల కోత  పోస్ట్‌లతో నిండిపోయాయని హాంగ్‌కాంగ​ వా​ర్తా సంస్థ పేర్కొంది.

షావోమి సంస్థలో సెప్టెంబరు 30 నాటికి 35,314 మంది సిబ్బంది ఉండగా, ఇటీవల చైనాలోని మెయిన్‌ల్యాండ్‌లోనే 32,000 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల వేలాది మంది సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారనుంది. వీరిలో చాలా మంది గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన నియామక ప్రక్రియలో కంపెనీలో చేరారు.

నవంబర్‌ మూడవ త్రైమాసిక ఆదాయంలో 9.7% తగ్గుదల ఉన్నట్లు కంపెనీ ఇటీవల పేర్కొంది. చైనాలో కోవిడ్‌ నిబంధనలు కారణంగా వ్యాపార పరిస్థితులు కూడా అంతగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని కంపెనీ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచే వచ్చే ఆదాయం, దాని మొత్తం అమ్మకాలలో దాదాపు 60% వాటాను కలిగి ఉంది,అయితే అది ఈ సంవత్సరానికి 11% పడిపోయింది, షావోమి తెలిపింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top