యాక్సిస్‌ ఎనర్జీతో బ్రూక్‌ఫీల్డ్‌ జేవీ | Brookfield JV With Axis Energy | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ ఎనర్జీతో బ్రూక్‌ఫీల్డ్‌ జేవీ

Sep 29 2023 2:38 AM | Updated on Sep 29 2023 2:38 AM

Brookfield JV With Axis Energy - Sakshi

నవాల్‌ సైనీ, రవి కుమార్‌ రెడ్డి (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకై తాజాగా బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ సహకరిస్తుంది. బ్రూక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ ట్రాన్సిషన్‌ ఫండ్‌–2 ద్వారా విద్యుత్‌ ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం కోసం రూ.7,026 కోట్ల వరకు ఈక్విటీ మూలధనాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నట్టు బ్రూక్‌ఫీల్డ్‌ ఎండీ నవాల్‌ సైనీ వెల్లడించారు.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ కస్టమర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా వివిధ పరిశ్రమలో పాల్గొనేవారికి ఇంధన పరిష్కారాలను అందించడానికి ఇరు సంస్థలు తమ నైపుణ్యం, వనరులను ఉపయోగించుకుంటాయని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ సీఎండీ కటారు రవి కుమార్‌ రెడ్డి తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్‌ ఖాతాలో భారత్‌లో 16 గిగావాట్ల పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో యాక్సిస్‌ ఎనర్జీతో కలిసి చేపట్టిన  ప్రాజెక్టులు 1.8 గిగావాట్లకు పైమాటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement