
ముంబై: బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సంస్థ బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (బీఐఐ) తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) గ్రూప్‌లోని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల తయారీ వ్యాపార విభాగంలో రూ. 1,925 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనుంది. ఎంఅండ్‌ఎం కూడా అదే స్థాయిలో రూ. 1,925 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనుంది. ఎస్‌యూవీల కోసం ఈవీ కంపెనీ పేరిట ఎంఅండ్‌ఎం అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
2024–2027 మధ్య కాలంలో ఈ సంస్థకు దాదాపు రూ. 8,000 కోట్ల వరకూ పెట్టుబడులు సమకూర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ 400 వాహనాలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని, 2023 జనవరి–మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కావచ్చని కంపెనీ ఈడీ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేశ్ జేజూరికర్ వివరించారు.