ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు | BOB Unveils Premium Senior Citizen Savings Account | Sakshi
Sakshi News home page

BOB: ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు

Apr 27 2026 3:12 PM | Updated on Apr 27 2026 3:20 PM

BOB Unveils Premium Senior Citizen Savings Account

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ‘బీవోబీ సీనియర్‌ సిటిజన్‌ విశేష్‌ సమ్మాన్‌’ పేరుతో వృద్ధులైన ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతాను తీసుకొచ్చింది. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు అదనంగా ఇంటి వద్దే బ్యాంకింగ్‌ సేవలను ఈ ఖాతా ద్వారా అందుకోవచ్చు.

60 ఏళ్లు నిండిన వారి కోసం ఈ ఖాతాను ప్రత్యేకంగా రూపొందించినట్టు ప్రకటించింది. కుటుంబంలో ఆరుగురు సభ్యుల కోసం ఉచిత ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టేషన్లను పొందొచ్చు. అలాగే, ఆన్‌లైన్‌లో ఔషధాల కొనుగోలుపై 15 శాతం, డయాగ్నోస్టిక్స్‌ సేవల చార్జీల్లో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రుణంపై ప్రాసెసింగ్‌ చార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్‌ అద్దెల్లోనూ 20 శాతం తగ్గింపు పొందొచ్చని సంస్థ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్‌ ప్రకటించారు. ఈ ఖాతాలో కనీస నిల్వ రూ.లక్ష ఉంచాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement