ఆస్టెక్‌ లైఫ్‌- బ్లూడార్ట్‌.. ఎక్స్‌ప్రెస్‌‌ స్పీడ్‌

Bluedart express- Astec lifesciences jumps on Q2 results - Sakshi

పతన బాటలో మార్కెట్లు

  328 పాయింట్లు డౌన్‌ -39,422కు సెన్సెక్స్‌

82 పాయింట్లు క్షీణించి 11,589ను తాకిన నిఫ్టీ

క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు

16 శాతం దూసుకెళ్లిన బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

9 శాతం జంప్‌చేసిన ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ షేరు

ఉదయం సెషన్‌లో జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా పతన బాట పట్టాయి. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 328 పాయింట్లు కోల్పోయింది. 39,422కు చేరింది. నిఫ్టీ సైతం 82 పాయింట్ల నష్టంతో 11,589ను తాకింది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఓవైపు బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌.. మరోపక్క హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ నికర లాభం 189 శాతం జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 867 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 17.5 శాతం పుంజుకుని రూ. 57 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 3,767కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 3,603 వద్ద ట్రేడవుతోంది.

ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌ నికర లాభం 238 శాతం జంప్‌చేసి రూ. 18 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 155 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 205 శాతం ఎగసి రూ. 24 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 1,185కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 1,168 వద్ద ట్రేడవుతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top