హైదరాబాద్‌లో తొలి మల్టీ బ్రాండ్ ఈవీ స్టోర్.. ఇక అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే చోట! | BLive launches New Multi-Brand EV Experience Store in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తొలి మల్టీ బ్రాండ్ ఈవీ స్టోర్.. ఇక అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే చోట!

Feb 7 2022 6:48 PM | Updated on Feb 7 2022 6:52 PM

BLive launches New Multi-Brand EV Experience Store in Hyderabad - Sakshi

ప్రముఖ మల్టీ బ్రాండ్ ఈవీ స్టోర్ కంపెనీ బీలైవ్ తన రెండో మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో, సంస్థ దక్షిణ భారతదేశంలో తన తొలి మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రంలో వినియోగదారులకు 20కి పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి. మల్టీబ్రాండ్ ఈవీ కేంద్రంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లను విక్రయించనున్నారు. 

ఈ మల్టీబ్రాండ్ ఈవీ కేంద్రంలో కైనెటిక్ గ్రీన్, టెకో ఎలెక్ట్రా, జెమోపై, బాట్:ఆర్ఈ, డెటెల్ వంటి బ్రాండ్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడంతో పాటు ఈ స్టోరు ఛార్జింగ్ సొల్యూషన్స్, పోస్ట్ సేల్స్ సర్వీస్ ప్యాకేజీలను కూడా అందిస్తుంది. ఈ స్టోర్ ప్రారంభం గురించి బిలైవ్ సహ వ్యవస్థాపకుడు సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 2024 నాటికి 5 బిలియన్ పెరగనున్నట్లు అంచనా వేశారు. "ఈవీలను కొనుగోలు చేయడానికి, ఉపయోగించడానికి కస్టమర్లకు ఒక ఫ్లాట్ ఫారాన్ని అందించడమే బిలైవ్ విజన్. మరింత మంది వినియోగదారులు, వ్యాపారులు తక్కువ ధరలో ఎక్కువ దూరం  ప్రయాణించడానికి కోరుకోవడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది" అని ఆయన తెలిపారు. బిలైవ్ ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ త్వరలో దేశవ్యాప్తంగా 100కి పైగా ప్రదేశాలలో ఓపెన్ చేయనున్నట్లు ఖోల్కర్ తెలిపారు. 

(చదవండి: ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement