Image credit @Anushka257(x handle)
ఉద్యోగం రావడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో దిగ్గజ కంపెనీలలో జాబ్ దక్కించుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. చదువు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన ఉద్యోగం రానివారు చాలా మందే ఉన్నారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ యువతి వేగంగా కెరియర్ వేగాన్ని చూస్తే ఆశ్చర్యంతో అభినందించాల్సిందే.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో జాబ్ ఎందరికో కలల ఉద్యోగం. అంతటి ఘనమైన ఉద్యోగాన్ని దక్కించుకున్న యువ టెకీ.. ఒక్క నెల కూడా గడవకముందే వద్దుపో.. అని వదిలేసింది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత మైలురాళ్లు, ప్రస్థానాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు పరిపాటి. అలాగే అనుష్క శర్మ కూడా తన కెరియర్ గమనాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో షేర్ చేశారు.
బెంగళూరుకు చెందిన అనుష్క శర్మ 20 ఏళ్ల వయసులో ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ జాబ్‌తో తన కెరియర్ను ప్రారంభించారు. తర్వాత మూడేళ్లకు అది మానేసి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 24 ఏళ్లకు అమెజాన్లో అంతర్జాతీయ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఏడాదే ఎంబీఏ చేసిన ఆమె 26 ఏళ్ల వయసులో ప్రఖ్యాత గూగుల్లో మంచి జాబ్ దక్కించుకున్నారు. కానీ చేరి నెల రోజులు కూడా గడవకుండానే దాన్ని వదిలేశారు. అనంతరం వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కారు. పెళ్లి చేసుకుని 27 ఏళ్లకే సొంతంగా కంపెనీ పెట్టేశారు. ఆమె కంపెనీ పేరు ‘డ్రింక్‌క్వెంజీ’. ఇదో ప్రోబయోటిక్ సోడా కంపెనీ.
అనుష్క శర్మకు పోస్ట్‌కు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. విజయవంతమైన ఆమె కెరియర్ గమనాన్ని నెటిజనులు అభినందించకుండా ఉండలేకపోయారు. ‘మీ అనుభవానికే సంబంధం లేని సోడా కంపెనీని ఎలా ప్రారంభించారు?’ అంటూ ఓ యూజర్ ఆశ్చర్యపోయారు. ‘ గూగుల్ జాబ్ను ఎందుకు విడిచిపెట్టారు?’ అని మరో యూజర్ ఆతృతగా ప్రశ్నించగా దానికామె వ్యక్తిగత కారణాలు అని బదులిచ్చారు.
ఇదీ చదవండి: నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్ అంబానీ వరాలు
ఇక అనుష్క శర్మ విద్యార్హతల విషయానికి వస్తే.. ఆమె లింక్డ్‌ఇన్ బయో ప్రకారం.. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనుష్క శర్మ ఆ తర్వాత ఈఎస్సీపీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
20 -started my investment banking job, lowkey enjoyed itt soo much
23- went for masters
24 - got my first international job and my first FAANG job at Amazon
25- finished mba
26 - joined google and quit google in less than a month
27 - got married to the love of my life ,… https://t.co/AsRVaAOkJK— Anushka Sharma (@Anushka257) November 12, 2025


