Battlegrounds Mobile India: అకౌంట్లు బ్లాక్‌ అవుతున్నాయ్‌, తస్మాత్‌ జాగ్రత్త

Battlegrounds Mobile India bans 25 Lakh Accounts Permanently For Cheating - Sakshi

గేమింగ్‌ ప్రియులకు పబ్‌జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్‌జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనదేశంలో దేశ భద్రత కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్‌ చేసింది. దీంతో ఆ గేమ్‌ మాతృసంస్థ  దక్షిణ కొరియా గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ 'బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా' (బీజీఎంఐ) గేమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్‌లో 40 రోజుల వ్యవధిలో 25 లక్షల అకౌంట్లను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నిషేధించినట్లు బీజీఎంఐ  క్రాఫ్టన్‌ తెలిపింది. 

లక్షల్లో అకౌంట్లు బ్లాక్‌
వరల్డ్‌ వైడ్‌ పబ్జీ గేమ్‌ క్రేజ్‌ కొనసాగుతుంది. రెవెన్యూ పరంగా ప్రస్తుతం వరల్డ్‌ వైడ్‌ గా 197 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న గేమ్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి. అందుకే క్రాఫ్టన్ సంస్థ సెప్టెంబర్‌లో 1,40,000, అక్టోబర్‌లో 88వేల అకౌంట్లను బ్లాక్‌ చేసింది. అక్టోబర్ 1నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో ఖచ్చితంగా 25,19,262 గేమ్‌ అకౌంట్లను శాస్వతంగా, 7,06,319 అకౌంట్లను తాత్కాలికంగా నిషేదం విధించినట్లు క్రాఫ్టన్‌ సంస్థ ఓ రిపోర్ట్‌ విడుదల చేసింది. బీజీఎంఐ పేరుతో చీటింగ్‌ చేసే వాళ్లపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.  

బ్యాన్‌ పై సందిగ్ధత
గేమ్‌ పేరుతో చీటింగ్‌ చేసే అకౌంట్లను బ్యాన్‌ చేసే అంశంపై సందిగ్ధత నెలకొందని గేమ్‌ డెవలపర్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. కానీ మోసాలు పెరిగిపోవడంతో అకౌంట్లను బ్యాన్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించారు. ఇందుకోసం క్రాఫ్టన్‌ సంస్థ  చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్‌ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్‌ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది.

చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top