నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!

Dynamo Gaming Net Worth 2021: Earnings, Income  - Sakshi

ఒక్కప్పుడు డబ్బు సంపాదించాలంటే తక్కువ మార్గాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు అందిపుచ్చుకోవాలే గానే బోలెడన్ని అవకాశాలు మన ముందు ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. యూట్యూబ్‌ అంటే ఒకప్పుడు ఇది ఎవరికి తెలియని పేరు కానీ, స్మార్ట్ ఫోన్ పుణ్యమా దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం వినోదాన్ని అందించే ఒక యాప్ మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే ఒక బంగారు గని. 

మీకు క్రియేటివిటీ తెలిసి ఉండాలే గాని.. ఇందులో బోలెడంత సంపాదించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. కేవలం మన దగ్గర మంచి పనితీరు గల గేమింగ్ కంప్యూటరు, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంట్లో నుంచే లక్షలు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నాడు మన దేశానికి చెందిన గేమర్. అతని పేరు ఆదిత్య సావంత్. కానాలెడ్జ్‌.కామ్‌ ప్రకారం.. సావంత్ తన యూట్యూబ్ గేమింగ్ చానెల్ డైనమో గేమింగ్ ద్వారా నెలకు రూ.25 లక్షలు పైగా సంపడిస్తున్నాడు. డైనమో గేమింగ్ నెట్ వర్త్ వచ్చేసి 3 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు). (చదవండి: మరో రికార్డును బిట్‌కాయిన్‌ నెలకొల్పనుందా...!)

ఆదిత్య సావంత్ 1996 ఏప్రిల్ 18న ముంబైలో దీపక్ సావంత్, వైశాలి సావంత్ లకు జన్మించాడు. డైనమో గేమింగ్ అనేది అతని పేరు, దీనిని అతను తరచుగా ఆటలలో లేదా యూట్యూబ్ స్ట్రీమింగ్ లో ఉపయోగిస్తాడు. అతను భారతదేశం, ప్రపంచంలోని అతిపెద్ద గేమర్లలో ఒకడు. అతను పబ్‌జీ మొబైల్(PUBG)లో స్నైపర్ గా ప్రసిద్ధి చెందాడు. డైనమో అనేకసార్లు అంతర్జాతీయ వేదికపై మనదేశం తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఆన్లైన్ గేమింగ్ ఆడే చాలా మందికి అతని పేరు తెలియకుండా ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top