మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.
➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్‌పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.
➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.
➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.


