వచ్చే నెల బ్యాంకు పనులున్నాయా? ఇవి తెలుసుకోవాల్సిందే! | Bank Holidays in September 2025: Full State-Wise List Released by RBI | Sakshi
Sakshi News home page

వచ్చే నెల బ్యాంకు పనులున్నాయా? ఇవి తెలుసుకోవాల్సిందే!

Aug 28 2025 5:25 PM | Updated on Aug 28 2025 5:46 PM

Bank holidays in September 2025 Check state wise

ఆగస్టు నెల ముగింపునకు వచ్చేసింది. తర్వాత సెప్టెంబర్‌ నెల ప్రారంభం కాబోతోంది. సెస్టెంబర్‌ నెలలో పెద్ద సంఖ్యలో పండుగలు ఉండటంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. కర్మ పూజ, ఓనం, ఈద్-ఎ-మిలాద్, ఇంద్రజాత్ర, నవరాత్రి స్థాపన, దుర్గా పూజ మహారాజా హరి సింగ్ జీ జయంతి వంటి పండుగలు, ప్రాంతీయ సందర్భాల కోసం వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

అయితే ప్రాంతాలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి కాబట్టి బ్యాంకు బ్రాంచీలను సందర్శించే ముందు వినియోగదారులు రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను పరిశీలించాలి. ఆదివారాలు, జాతీయ, ప్రాంతీయ బ్యాంకుల సెలవులతో పాటు నెలలోని రెండు, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు మూతపడతాయి.

సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు
ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం సెప్టెంబర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా ఉన్నాయి.. కర్మ పూజ, మొదటి ఓనం, ఈద్-ఎ-మిలాద్, తిరువోనం, ఈద్-ఎ-మిలాద్, ఇంద్రజాత్ర, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత వచ్చే శుక్రవారం, నవరాత్ర స్థాపన, మహారాజా హరి సింగ్ జీ జన్మదినం, మహా సప్తమి / దుర్గా పూజ వంటి సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులు పాటిస్తూ మూసి ఉంటాయి.

  • సెప్టెంబర్ 3, 2025 (బుధవారం) కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు

  • సెప్టెంబర్ 4, 2025 (గురువారం) ఓనం పండుగ సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.

  • సెప్టెంబర్ 5, 2025 (శుక్రవారం) గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, కేరళ, న్యూఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ, శ్రీనగర్లలో ఈద్-ఎ-మిలాద్, తిరువోనం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

  • సెప్టెంబర్ 6, 2025 (శనివారం) ఈద్-ఎ-మిలాద్ (మిలాద్-ఉన్-నబీ)/ఇంద్రజాత్ర కోసం సిక్కిం, ఛత్తీస్‌గడ్‌లలో బ్యాంకులకు సెలవు

  • సెప్టెంబర్ 12, 2025 (శుక్రవారం) ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులు మూసివేస్తారు.

  • సెప్టెంబర్ 22, 2025 (సోమవారం) నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు

  • సెప్టెంబర్ 23, 2025 (శనివారం) మహారాజా హరి సింగ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు

  • సెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మహా సప్తమి, దుర్గా పూజను జరుపుకోవడానికి త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

  • సెప్టెంబర్ 30, 2025 (మంగళవారం) త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement