
భారతదేశంలో బజాజ్ చేతక్ లాంచ్ అయినప్పటి నుంచి ఐదు లక్షల అమ్మకాలను అధిగమించింది. నవంబర్ 2023లో 1,00,000 అమ్మకాల మైలురాయిని చేరుకున్న ఈ స్కూటర్.. తాజాగా 5,10,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
2020లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బజాజ్ చేతక్ 46 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. అయితే గడిచిన 10 నెలల కాలంలోనే 2.06 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందగలిగింది. మొత్తం మీద ఐదు లక్షల సేల్స్ అధిగమించింది. దీన్నిబట్టి చూస్తే దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే!
బజాజ్ చేతక్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం.. ఇది 3001, 3501, 3502, 3503 అనే వేరియంట్లలో అందుబాటులో ఉండటం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా 3,800 కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌లతో కూడిన సర్వీస్ నెట్‌వర్క్ కూడా అని తెలుస్తోంది. ఈ స్కూటర్లు లేటెస్ట్ డిజైన్ కలిగి.. 3 కిలోవాట్ బ్యాటరీ, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో అబందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.99,900 (ఎక్స్ షోరూమ్).