
‘అజూర్ పవర్’ 2.3 కోట్ల డాలర్లు చెల్లింపు
లంచం, ఇతరత్రా అవకతవకల ఆరోపణల కేసును సెటిల్ చేసుకున్నట్లు సౌర విద్యుదుత్పత్తి సంస్థ అజూర్ పవర్ వెల్లడించింది. ఇందుకోసం 2.3 కోట్ల డాలర్లు చెల్లించినట్లు వివరించింది. కొత్త ప్రాజెక్టులను దక్కించుకునేందుకు కీలక డేటాను తప్పుగా చూపించినట్లు, లంచాలు చెల్లించినట్లు అజూర్ పవర్‌తో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్‌లు రంజిత్ గుప్తా, మురళి సుబ్రమణియన్, పవన్ కుమార్ అగ్రవాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అజూర్ షేర్లు లిస్టయి ఉన్నాయి. నిబంధనలను పాటించే విషయంలో వారు తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనలు చేశారని, ఫలితంగా కృత్రిమంగా పెరిగిపోయిన షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని క్లాస్ యాక్షన్ సూట్ నమోదైంది. దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కంపెనీ నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.
ఇదీ చదవండి: రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే!