చాట్‌జీపీటీ అద్భుతం.. నేను అడిక్ట్‌ అయ్యా : అదానీ

Asia Richest Man Gautam Adani Addicted To Chat Gpt - Sakshi

న్యూఢిల్లీ: కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్‌జీపీటీపై పారిశ్రామిక దిగ్గజాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ కూడా ఈ జాబితాలో చేరారు. దీన్ని వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకూ ఇది కొంత వ్యసనంలా మారిందని అదానీ పేర్కొన్నారు. 

దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో అంతటా ఏఐ గురించే ప్రధానంగా చర్చ జరిగిందని లింక్డ్‌ఇన్‌లో అదానీ రాశారు.

ఎంతో ఉపయోగకరమైన ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు చాట్‌జీపీటీ తోడ్పడగలదని ఆయన తెలిపారు. జోకులు, పద్యాలు, వ్యాసాలు మొదలుకుని కంప్యూటర్‌ కోడింగ్‌ వరకు ఎలాంటి అంశం అయినా అనంతమైన సమాచారాన్ని క్రోడీకరించి యూజర్‌కు కావాల్సినట్లుగా కంటెంట్‌ను చాట్‌జీపీటీ అందిస్తుంది. యూజర్లతో అచ్చం మనుషుల్లాగే సందర్భోచితంగా సంభాషిస్తుంది. ఓపెన్‌ఏఐ రూపొందించిన  ఈ చాట్‌బాట్‌ ప్రస్తుతం ఇంకా ప్రయోగదశలో ఉంది.   

చదవండి👉  ‘అదానీ సంపద హాంఫట్‌’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top