
ఆధునిక కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని పొదుపుగా ఇలా వాడొచ్చు అనే సంఘటనకు సంబంధించిన ఒక పోస్ట్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసాడు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో రెస్ట్ రూమ్‌లోని టాయిలెట్‌కు హ్యాండ్ వాష్ సింక్ జతచేసి ఉండటం చూడవచ్చు. ఇందులో చేతులు కడుక్కుంటే ఆ నీరు కిందికి వెళుతుంది. దానిని ఫ్లష్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల నీరు ఆదా అవుతుంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్, కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటిది మనదేశంలో ఉంటే బాగుంటుందన్నారు.
Simple innovations. Perhaps the strongest weapons to sustain the planet… This should become a standard in India. https://t.co/a56EUxxJRC
— anand mahindra (@anandmahindra) July 18, 2023