బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఆరోజు కూడా తెరవాల్సిందే..

All bank branches to remain open on March 31 rbi - Sakshi

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు మార్చి 31న కూడా తెరిచే ఉంచాలని సూచించింది. మార్చి 31న పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంక్ బ్రాంచులను తెరిచే ఉంచాలని వెల్లడించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యాన్వల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఆ రోజునే ఉంటుంది.

ఇదీ చదవండి: Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్‌’ బాగోతం ఇదే..

మార్చి 31, 2023న సాధారణ పని వేళల వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది-కౌంటర్ లావాదేవీల కోసం సంబంధిత శాఖలను తెరిచి ఉంచాలని అన్ని బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ తన లేఖలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోపు లెక్కించాలని ఏజెన్సీ బ్యాంకులను ఆదేశించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్‌), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్‌) ద్వారా లావాదేవీలు మార్చి 31 అర్ధరాత్రి 12 వరకు కొనసాగుతాయి.

ఇదీ చదవండి: పిన్‌ అవసరం లేదు!.. పేమెంట్‌ ఫెయిల్‌ అయ్యే సమస్యే లేదు!  

అంతేకాకుండా ప్రభుత్వ చెక్కులకు సంబంధించి మార్చి 31న స్పెషల్ క్లియరింగ్ కూడా నిర్వహించాలని సూచించింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్) కీలక ఆదేశాలు జారీ చేయనుంది. GST/TIN2.0/e రిసిప్ట్స్ లగేట్ ఫైల్స్ అప్‌లోడింగ్‌ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి మార్చి 31 రిపోర్టింగ్ విండో ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top