టాటా కీలక నిర్ణయం, ఇబ్బందుల్లో ఎయిరిండియా ఉద్యోగులు!

Air India Pilots Request Voluntary Base Transfer - Sakshi

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొనుగోలు ఒప‍్పంద సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎయిరిండియా ఉద్యోగులకు శాపంగా మారింది. 

ఎయిరిండియాను కొనుగోలుతో ఆ సంస్థ రూపు రేఖల్ని మార్చేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్‌ క్రూ సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకునేలా ప్రోత్సహకాల్ని అందింస్తుంది.

అదే సమయంలో ఖర్చు తగ్గించి ఉన్నత స్థాయిలో విమానాల సర్వీసుల్ని ప్రయాణికులకు అందించాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ముంబై ఎయిరిండియా కార్యకలాపాల్ని ఢిల్లీకి తరలించేలా భావిస్తుంది. ఈ నేపథ్యంలో  ట్రాన్స్‌ ఫర్‌ విషయంపై ముంబైలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించింది. ఇప్పుడీ ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఎయిరిండియాకు చెందిన వైడ్‌ బారీ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు(పెద్ద విమానాలు) సర్వీసులన్నీ ముంబై నుంచే జరుగుతుంటాయి. ఒక దశాబ్దం క్రితం, ముంబై విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ ప్రముఖ పాత్ర పోషించడంతో వ్యాపార అభివృద్ది కోసం ఎయిర్ ఇండియా తన స్థావరాన్ని ఢిల్లీకి మార్చింది. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలలో ఎక్కువ భాగం ఢిల్లీ నుండి సర్వీసుల్ని అందిస్తున్నాయి. కానీ ఎయిరిండియాకు చెందిన భారీ ఎయిర్‌ క్ట్రాఫ్ట్‌ సిబ్బంది ముంబైలో విధులు నిర్వహించడం, వారిని ఢిల్లీకి ట్రాన్స్‌ ఫర్‌ చేస్తూ టాటా గ్రూప్‌ నిర్ణయంతో ఉద్యోగులకు సమస్యగా మారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top