Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే? | Ai Plus Nova 2 Goes on Sale from April 14 Price Specs and Features Revealed | Sakshi
Sakshi News home page

Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?

Apr 14 2026 10:27 PM | Updated on Apr 14 2026 10:27 PM

Ai Plus Nova 2 Goes on Sale from April 14 Price Specs and Features Revealed

నోవా సిరీస్‌లో భాగంగా తమ సరికొత్త డివైస్‌ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్‌ఫోన్‌ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Ai+ నోవా 2 ధరలు
4జీబీ + 64 జీబీ: రూ.8,999
6 జీబీ + 128 జీబీ: రూ.10,999

మొదటిసారి అప్‌గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్‌ఫోన్ సీఈఓ, నెక్స్ట్‌ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్‌ అన్నారు.

6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్‌ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్‌తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్‌ప్లేతో వినియోగదారులు కంటెంట్‌ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్‌, నిరంతరాయమైన స్క్రోలింగ్‌ అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్‌ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement