'డబ్బులు ఎవరికీ ఊరికే రావు', 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

5g Supported Processors And Smartphones List In India 2022 - Sakshi

దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరుణంలో చాలా మందికి వచ్చే సందేహం..ఏ ఫోన్‌ కొనాలి? అని. ఏ ఫోన్‌కి 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుంది అని. ఇప్పుడా అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఏ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందో తెలుసుకుందాం. 

5జీకి సపోర్ట్‌ ఇవ్వాలంటే ఫోన్‌లో అందుకు సపోర్ట్‌ చేసే ప్రాసెసర్‌ ఉండాలి. అయితే దేశీయంగా  5జీ విప్లవం జోరందుకోవడంతో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు తాము తయారు చేసిన ఫోన్‌లలో 5జీ సపోర్ట్‌ చేసేలా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయంటూ కొనుగోలు దారుల్ని నమ్మబలికిస్తుంటాయి. డబ్బులెవరికీ ఊరికే రావు. అలాంటి ప్రకటనల పట్ల కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

5జీ ప్రాసెసర్‌ 
మీరు కొనాలనుకున్న, లేదంటే ఇప్పటికే కొన్న ఫోన్‌లకు 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదా? అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే యూజర్లు వారి ఫోన్‌   సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత  అబౌట్‌ ఫోన్‌ ఆనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేసి ప్రాసెసర్‌పై క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌ 5జీకి సపోర్ట్‌ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. 
 
క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌ : స్నాప్‌డ్రాగన్ 865, స్నాప్‌డ్రాగన్ 865+, స్నాప్‌డ్రాగన్ 870, స్నాప్‌డ్రాగన్ 888, స్నాప్‌డ్రాగన్ 888+, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1, స్నాప్‌డ్రాగన్ 8+ జనరల్ 1, స్నాప్‌డ్రాగన్ 695, స్నాప్‌డ్రాగన్ 765/765జీ, స్నాప్‌డ్రాగన్ 750/750/జీ, స్నాప్‌డ్రాగన్ 768/768/జీ, స్నాప్‌డ్రాగన్ 778/778జీ/ 778ప్లస్‌  

మీడియా టెక్‌ ప్రాసెసర్‌ : మీడియా టెక్‌ డైమన్సిటీ  700 నుండి డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌ వరకు మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి. ఇవి కాకుండా మీడియా టెక్‌ హీలియా  సిరీస్‌తో పాటు ఇతర సిరీస్‌ ప్రాసెసర్‌లు 5జీకి సపోర్ట్‌ చేయవు. 

శాంసంగ్‌ ప్రాసెసర్‌  : ఎక్సినోస్ 9820, ఎక్సినోస్ 9825,ఎక్సినోస్ 990,ఎక్సినోస్2100, ఎక్సినోస్ 2200లు 5జీకి సపోర్ట్‌ చేస్తాయి. 

5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ ఇచ్చే ఫోన్‌లు ఇవే 

యాపిల్‌ – ఐఫోన్‌ 12 సిరీస్, ఐఫోన్‌ 13 సిరీస్, ఐఫోన్‌ ఎస్‌ఈ 2022

శాంసంగ్‌ – శాంసంగ్‌ ఎస్‌-సిరీస్‌ (ఎస్‌20 అంతకంటే ఎక్కువ), గెలాక్సీ ఎస్‌ 20 ఎఫ్‌ఈ 5జీ, గెలాక్సీ ఎస్‌ 21 ఎఫ్‌ఈ 5జీ, ఏ-సిరీస్, ఎం-సిరీస్ మోడల్‌లు సపోర్ట్‌ చేస్తాయి. 
 
వన్‌ ప్లస్‌ - వన్‌ ప్లస్‌ 8 సిరీస్‌, వన్‌ ప్లస్‌ 9 సిరీస్‌, వన్‌ ప్లస్‌ 10సిరీస్‌, వన్‌ ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌ 

షావోమీ- షావోమీ 12 సిరీస్‌,షావోమీ 11 సిరీస్‌, షావోమీ10సిరీస్‌, షావోమీ నోట్‌ 11 ప్రో ప్లస్‌, రెడ్‌ మీ నోట్‌ 11టీ, రెడ్‌మీ నోట్‌ 10 టీ 

పోకో- పోకో ఎఫ్‌4 5జీ, పోకో ఎం4 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ

ఒప్పో - రెనో 8 సిరీస్, రెనో 7 సిరీస్, రెనో 6 సిరీస్, ఒప్పో ఏ-సిరీస్, కె-సిరీస్, ఎఫ్-సిరీస్ ఫోన్‌లు 

వివో - వీ21, వీ21ఈ, వీ 23 సిరీస్‌, టీ1 సిరీస్‌,ఎక్స్‌ 60-సిరీస్, ఎక్స్‌ 70-సిరీస్, ఎక్స్‌ 80-సిరీస్

ఐక్యూ- ఐక్యూ009 సిరీస్‌,ఐక్యూ7 సిరీస్‌, ఐక్యూ జెడ్‌ 5, ఐక్యూ జెడ్‌ 6, ఐక్యూ జెడ్‌ 6 ప్రో 

రియల్‌ మీ - రియల్‌ మీ జీటీ సిరీస్‌, రియల్‌ మీ జీటీ 2 సిరీస్‌, రియల్‌ మీ ఎక్స్‌ 7, రియల్‌ మీ ఎక్స్‌ 7 మ్యాక్స్‌, రియల్‌ మీ ఎక్స్‌ 7 ప్రో, రియల్‌ మీ నార్జ్‌ 50 5జీ,  రియల్‌ మీ నార్జో 30 5జీ,  రియల్‌ మీ 8/8ఎస్‌/8 ప్రో 5G, రియల్‌ మీ 9/ 9 ప్రో  5జీ ఫోన్‌లు మాత్రమే 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేస్తాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

చదవండి👉: What is 5G?: 5జీ అంటే ఏమిటి? ఈ నెట్‌ వర్క్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top