5జీతో ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు

 5G Domain Jobs Doubled in One Year in India - Sakshi

టెలికాం రంగంలో త్వరలో రాబోయే 5జీ టెక్నాలజీ వల్ల 2020 నాల్గవ త్రైమాసికం, 2021 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల నియామకం రెట్టింపు అయినట్లు డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా తన నివేదికలో వెల్లడించింది. కొత్త తరం టెక్నాలజీ 5జీపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు, ప్రభుత్వం ట్రయల్స్, టెస్టింగ్‌ కోసం అనుమతించినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్ ఎలిమెంట్స్‌కి అనుసంధానించాలని కంపెనీలు చూస్తున్నాయి.

"2020 నాల్గవ త్రైమాసికంలో, 2021 మొదటి త్రైమాసికంలో మధ్య ఉద్యోగాల నియామకం రెట్టింపు అయ్యాయి. 5జీ డొమైన్‌లో నైపుణ్యం గల ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నెట్‌వర్క్‌లు, ఐపీ నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్, ఆటోమేషన్ వంటి రంగాలలో అనుభవం గల ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు" గ్లోబల్‌డేటాలో బిజినెస్ ఫండమెంటల్స్ అనలిస్ట్ అజయ్ తల్లూరి తెలిపారు. టెలిఫోనాక్టిబోలాగేట్ ఎల్ఎమ్ ఎరిక్సన్(ఎరిక్సన్) భారతదేశంలో 2020 జనవరి 1 నుంచి కొత్తగా మరో 20 శాతం ఉద్యోగా నియామకాలను చేపట్టింది. ఎందుకంటే కంపెనీ సెల్యులార్, రేడియో నెట్‌వర్క్ అవకాశాలను పరిశీలిస్తుంది. 

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రాజెక్టుల కోసం సిస్కో సిస్టమ్స్ 5 బిలియన్ డాలర్ల(రూ.36,546 కోట్లు)ను పెట్టుబడి పెట్టింది. అందులో భాగంగానే 2020 1 జనవరి నుంచి కంపెనీ భారతదేశంలో మరో 30 శాతానికి కంటే ఎక్కువ శాతం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వర్చువలైజ్డ్ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సిస్కో క్లౌడ్ కోర్, ప్యాకెట్ కోర్ కోసం ఇంజనీర్లను ఎంచుకుంటుంది. డెల్ టెక్నాలజీస్ (డెల్), క్వాల్‌కామ్ టెక్నాలజీస్ వంటి 5జీ డొమైన్‌లో భారీగా ఉద్యోగా నియామకాలు చేపడుతున్నాయి. అందుకే కేవలం ఒక ఏడాదిలో ఈ డొమైన్‌లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు గ్లోబల్‌డేటా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

చదవండి: RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top