RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి

RockYou2021 is Largest Password Leak at 8 4 Billion Entries - Sakshi

ప్రముఖ హ్యాకర్ ఫోరమ్‌లో భారీ మొత్తంలో పాస్‌వర్డ్ డేటాను లీక్ చేశారు. ఆ ఫోరమ్ 100జీబీ టెక్స్ట్ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సుమారు 8.4 బిలియన్ల పాస్‌వర్డ్‌లు ఉన్నాయి. ఇందులో గతంలో లీకైన డేటా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లీకైన డేటలో పాస్‌వర్డ్‌లు 6-20 అక్షరాల పొడవు ఉన్నాయి. హ్యాకర్స్ పోస్ట్ చేసిన టెక్స్ట్ ఫైల్‌లో 82 బిలియన్ పాస్‌వర్డ్‌లు ఉన్నట్లు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. సైబర్ న్యూస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా దాదాపు 8,45 9,060,239గా ఉంది. 100జీబీ టెక్స్ట్ ఫైల్‌కు అనే ఫోరమ్ యూజర్ 'రాక్‌యూ 2021(rockyou2021.txt)'గా పేరు పెట్టారు. 

బహుశా 2009లో రాక్ యూ డేటా పేరుతో లీకైన డేటా కూడా ఉండవచ్చు అని సమాచారం. అందుకే ఈన్ని పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న టెక్స్ట్ ఫైల్‌కు రాక్‌యూ 2021 అనే పేరు పెట్టవచ్చు. ఆ సమయంలో లీకైన 32 మిలియన్ పాస్‌వర్డ్‌లను సోషల్ మీడియా సర్వర్ ల నుంచి హ్యాక్ చేశారు. అలాగే ఆ ఏడాది సమయంలో 3.2 బిలియన్ పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయి. ఇక్కడ రాక్‌యూ 2021 కూడా పెద్దదని గుర్తించాలసిందే. ఎందుకంటే రాక్ యూ పేరిట ఈ హ్యాకర్స్ గ్రూప్ చాలా డేటాను లీక్ చేశారు. వీరు కొన్ని ఏళ్లుగా ఈ డేటాను సేకరించారు. 

వాస్తవానికి, ఆన్‌లైన్‌లో కేవలం 4.7 బిలియన్ల మంది మాత్రమే ఉంటే, రాక్‌యూ 2021 పేరుతో విడుదల చేసిన మొత్తం డేటా ప్రపంచ ఆన్‌లైన్ నెటిజన్ డేటా కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. మరోసారి ఇంత మొత్తంలో చాలా మంది డేటా లీక్ కావడంతో యూజర్ల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూజర్లు తమ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదో చెక్‌ చేసుకోవడంతో పాటు తమ పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయా? లేదా అనేది చెక్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే పాస్‌వర్డ్‌లను ఛేంజ్ చేయడం ఉత్తమం అని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు.

చదవండి: హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top