ఎంజీ హెక్టార్‌ సరికొత్తగా, ధర ఎంత?

 2021 MG Hector SUV launches in India - Sakshi

ఎంజీ హెక్టార్‌ ఎస్‌యూవీ  కొత్త వేరియంట్‌ 

ప్రారంభ ధర రూ.16.15 లక్షలు 

సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ తన ఎస్‌యూవీ హెక్టార్‌లో 8-స్పీడ్‌ సీవీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూం వద్ద దీని ప్రారంభ ధర రూ.16.51 లక్షలుగా ఉంది. 

మెరుగైన బ్యాటరీ ప్యాక్, చక్కటి డ్రైవింగ్ శ్రేణితో  వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో ఐదు సీట్లతో హెక్టార్‌ 2021, ఆరు సీట్లతో హెక్టార్‌ ప్లస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పెట్రోల్‌ హెక్టార్‌ ఇప్పుడు మొత్తం నాలుగు ఆప్షన్‌లో లభ్యం కానుంది. మాన్యువల్, హైబ్రీడ్‌ మాన్యువల్,  డ్యూయల్‌ - క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఆవిష్కరించిన సీవీటీ ఆప్షన్‌ వెర్షన్‌ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ప్రయాణాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 12.89 లక్షలు  నుండి రూ. 18.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఎంజీ హెక్టార్‌ సీవీటీ వేరియంట్‌లో స్మార్ట్, షార్ప్ ట్రిమ్‌ మోడళ్ల‌ ధరలు రూ. 16.51 లక్షలు -18.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆరు సీట్ల హెక్టార్‌లోప్లస్ కూడా కొత్త సీవీటి గేర్‌బాక్స్‌ను  జోడించింది. వీటి ధరలు 17.21 లక్షలు - 18.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top