టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

జనరేటివ్‌ఏఐ విభాగంలో 75వేల మందికి శిక్షణ ఇస్తున్న ప్రముఖ సంస్థ

Published Tue, Apr 30 2024 9:57 AM

10,000 freshers to be hired during this year, says HCLTech CEO Vijayakumar

టెక్‌ కంపెనీలు జనరేటివ్‌ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్‌ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్‌ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ

కంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్‌ కంపెనీలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలపై క్లౌడ్‌, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్‌ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్‌ ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement